Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పొత్తులపై ఫుల్ క్లారిటీ.. కీలక ప్రకటన దిశగా పవన్

Pawan Kalyan: పొత్తులపై ఫుల్ క్లారిటీ.. కీలక ప్రకటన దిశగా పవన్

Pawan Kalyan
Pawan Kalyan

 

Pawan Kalyan: జనసేన పార్టీ స్థాపించి పదేళ్లవుతున్న సందర్భంగా మచిలీపట్నంలో ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో రిచ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 36 ఎకరాల సువిశాల స్థలంలో సభను ఏర్పాటుచేయనున్నారు. 14 వ తేదీన సభ ఉంటుంది. అంతకంటే రెండు రోజులు ముందుగానే పవన్ అమరాతి చేరుకోనున్నారు. పార్టీ నేతలతో కీలక మంతనాలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల పరిస్థితిని తెలుసుకొని ఒక నివేదిక రూపొందించనున్నారు. జనసేన బలం ఏంటి? బలహీనతలు ఏంటి? ఏ నియోజకవర్గాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది? ఎక్కడ పికప్ చేసుకోవాలి? అన్న అంశాలపై స్టడీ చేయనున్నారు. రాజకీయంగా చేయవలసిన ప్రకటనలు, ఏ నిర్ణయాలు ప్రకటించాలో నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అందుకు అనుగుణంగా ఆవిర్భావ సభలో కీలక ప్రకటనలు చేయనున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan

డిసైడింగ్ ఫ్యాక్టర్ పార్టీగా జనసేన గుర్తింపు దక్కించుకుంది. ఆ పార్టీ కలిస్తే గెలుపు బాట పట్టవచ్చన్నది మిగతా పార్టీల అభిప్రాయం. అందుకే ఏపీలో రాజకీయాలు జనసేన చుట్టూ తిరుగుతున్నాయి. ఆ పార్టీతో జతకట్టే వారికి రాజకీయ అడ్వాంటేజ్ ఉంటుందన్న ప్రచారం ఉంది. అందుకే ఆ పార్టీ కోసం మిగతా రాజకీయ పక్షాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే పవన్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. అయితే ప్రస్తుతం జనసేన అధికారికంగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. కానీ భౌతికంగా మాత్రం లేదు. ఏ విషయంలో ఆ రెండు పార్టీలు కలిసి పోరాడింది లేదు. అందుకే కలిసి ఉన్నారే కానీ మనసులు మాత్రం దూరంగా ఉన్నాయి.

Also Read: KGF Fans: నానా బూతులు తిడుతున్న కెజిఫ్ ఫ్యాన్స్… అయినా తగ్గని కంచరపాలెం డైరెక్టర్, మళ్ళీ ఏమన్నాడంటే 

గత ఆవిర్భావ సభలో వైసీపీ అరాచకాలపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ పనితీరును మూడేళ్లు గమనించామని.. ఈసారి పోరాటం చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వకుండా కలిసొచ్చే రాజకీయ పార్టీలతో వెళతామని ప్రకటించారు. అప్పటి నుంచి పొత్తులపై ఒకరకమైన సానుకూల వాతావరణం ఏర్పడింది. టీడీపీ, జనసేనలు జత కడతాయని ప్రచారం సాగింది. కానీ దీనిపై పవన్ ఎప్పుడు డైరెక్ట్ గా కామెంట్స్ చేయలేదు. కానీ ఈ ఆవిర్భావ సభలో మాత్రం పొత్తులపై క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది వ్యవధి ఉండడంతో ఇదే కరెక్ట్ టైమ్ గా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే దమ్ముంటే ఒంటరిగా పోటీచేయాలని…175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాలని పవన్ కు అధికార పార్టీ సవాల్ విసురుతోంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేరని ఎగతాళి చేస్తోంది. ఒకవైపు రాజకీయంగా సవాల్ చేస్తూనే.. తెరవెనుక పవన్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోంది. అందుకే జనసేన ఆవిర్భావ సభలో అయోమయాలకు, గందరగోళాలకు తావులేకుండా పొత్తులపై క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఎన్నికలకు ఏడాది ఉండడంతో అటు వైసీపీపై యుద్ధం తీవ్రతరం చేయడంతో పాటు కేడర్ కు దిశానిర్దేశం చేసే చాన్స్ ఉన్నట్టు జన సైనికులు చెబుతున్నారు.

Also Read: Nabha Natesh: సైడ్ యాంగిల్ నుండి హాట్ స్పాట్ చూపించిన నభా నటేష్… చీరలో సూపర్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version