Ketika Sharma: ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ ఓ మాటన్నారు. టాలెంట్ ఉండాలి, స్క్రిప్ట్ సెలక్షన్ తెలియాలి, తొక్కా తోటకూర అంతా నథింగ్. హీరోయిన్ గా ఎదగాలంటే అదృష్టం ఉండాలి. పేపర్ మీద అద్భుతం అనిపించిన కథ సిల్వర్ స్క్రీన్ పై తేలిపోవచ్చు. స్క్రిప్ట్ దశలో సాదాసీదాగా అనిపించిన కథ వెండితెర మీద మిరాకిల్స్ చేయవచ్చు. కాబట్టి కేవలం లక్ ఫ్యాక్టర్ పరిశ్రమలో ఎదిగేందుకు కావాల్సిన ఓన్లీ ఫ్యాక్టర్ అని తేల్చి చెప్పింది. అది నిజం కూడా. అందం, అభినయం ఉండి కనీస గుర్తింపుకు నోచుకోలేక తెరమరుగైన తారలు ఎందరో ఉన్నారు.

ఆ లిస్ట్ లో కేతిక శర్మ చేరిపోయారు. కేతికకు గొప్ప యాక్టింగ్ టాలెంట్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే లక్ మాత్రం లేదు. ఆమెను దురదృష్టం వెంటాడింది. మూడు సినిమాలు చేస్తే ఒక్కటి కూడా కనీస విజయాన్ని నమోదు చేయలేదు. మూడుకి మూడు డిజాస్టర్ అయ్యారు. ఐరన్ లెగ్ ఇమేజ్ తో పరిశ్రమకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్ కేతిక శర్మ ను టాలీవుడ్ కి తీసుకొచ్చాడు. తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడు.

దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ యూత్ ని ఊపేస్తుందని యూనిట్ భావించారు. ఈ మూవీలో ఆకాష్ పూరి-కేతిక మొహమాటం లేకుండా నటించారు.వాళ్ళ ఇంటెన్స్ రొమాన్స్ చూసి కుర్రాళ్లు సీట్లలో కూర్చోలేకపోయారు. కేతిక సదరు మూవీలో ఆకాష్ కి సర్వం అర్పించేసింది. కథలో భాగమై ఓ బోల్డ్ లవ్ స్టోరీలో లీనమైన నటించింది. ఇంత సాహసం చేసినా విజయం మాత్రం దక్కలేదు. మూవీ పర్లేదు అనిపించుకుంది కానీ కమర్షియల్ గా ఆడలేదు.

నెక్స్ట్ హీరో నాగ శౌర్య ఆఫర్ ఇచ్చారు. స్పోర్ట్స్ డ్రామా లక్ష్య లో కేతిక హీరోయిన్ గా నటించారు. లక్ష్య మూవీ కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీతో కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ సాధించాడు. కానీ సినిమాలో కంటెంట్ లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. ప్రేక్షకులకు లక్ష్య కూడా కనెక్ట్ కాలేదు. దీంతో మూవీ ప్లాప్ అయ్యింది. ఇక ముచ్చటగా మూడో ప్లాప్ రంగరంగ వైభవంగా మూవీతో అందుకుంది కేతిక. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. రంగ రంగ వైభవంగా చిత్రాన్ని అవుట్ డేటెడ్ డ్రామాగా కొట్టిపారేశారు . దీంతో ఆమెకు అవకాశాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్నారు.