Sukrithi ‘కేరింత’.. బడా నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల మదిని దోచేసింది. అందరూ కొత్త కుర్రాళ్లతో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీలో ‘భావన’ అనే పాత్రలో నటించి మెప్పించింది సుకృతి. పార్వతీశంతో కలిసి ఈమె చేసిన కామెడీకి థియేటర్లో అందరూ తెగ ఎంజాయ్ చేశారు.

ఈ మూవీ తర్వాత పెద్దగా సినిమాల్లో కనపడలేదు సుకృతి. కేవలం కొన్ని వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ లో మాత్రమే కనిపించింది. తాజాగా ఈ అమ్ముడు పెళ్లికి రెడీ అయ్యింది. సుకృతి తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. సుకృతి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరన్నది అందరూ ఆరాతీస్తున్నారు.
సుకృతి ఎంగేజ్ మెంట్ తాజాగా ‘అక్షయ్ సింగ్’తో జరిగింది. ఈ సందర్భంగా సుకృతి స్పందిస్తూ ‘మా నాన్నే నా ప్రపంచం. భయపడినప్పుడు నా భుజం తట్టి.. నన్ను సంతోషపరుస్తూ.. నా చేయి పట్టుకొని నడిపిస్తూ నిత్యం నా వెంటే ఉన్నారు. ఎప్పుడూ నాకు గొప్ప నాన్నలాగే ఉన్నారాయన. ఐదేళ్ల క్రితం అమ్మ చనిపోయిందని.. అప్పటి నుంచి అమ్మ ప్రేమను సైతం ఆయనే అందించారని’ సుకృతి ఎమోషనల్ అయ్యింది.
సింగిల్ పేరంట్ గా ఉండడం అంత సులువైన పని కాదని.. నాకు తెలిసిన బలమైన వ్యక్తి మా నాన్న.. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ లవ్’ అంటూ పేర్కొంది సుకృతి. ఇక తన జీవితం అక్షయ్ సింగ్ తో ముందుకు సాగుతుందని తన ఎంగేజ్ మెంట్ ఫొటోలను, వీడియోలను పంచుకుంది. అవిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
Recommended Videos
https://www.youtube.com/watch?v=ZrPUfr3iUyw