Triple R : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా భారీ గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ఉంటారు ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ కి వస్తున్న కొత్త దర్శకులు భారీ అవార్డులను సైతం సొంతం చేసుకుంటున్నారు…ఇక ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా హాలీవుడ్ స్థాయి కి వెళ్తుంది…
సినిమా చేసే ప్రతి దర్శకుడి యొక్క లక్ష్యం ఒకటే ఆ మూవీ ని సూపర్ సక్సెస్ చేయడం…ఇక కొంతమంది సినిమా మేకర్స్ అయితే తమ సినిమాలను సక్సెస్ లుగా నిలపడమే కాకుండా అవార్డ్ లను సైతం అందుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక కొంతమంది మాత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డ్ జాబితాలో మరో కేటగిరి ని యాడ్ చేశారు….’స్టంట్ డిజైన్’ కేటగిరిలో కూడా అవార్డ్స్ ను ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. 2027 వ సంవత్సరం నుంచి వచ్చే ప్రతి సినిమాకి ఈ జాబితాలో ఉన్న స్టంట్ డిజైన్ కేటగిరి వర్తిస్తుందని వాళ్ళు పేర్కొన్నారు. ఇక 100 వ అకాడమీ అవార్డుల్లో బాగంగా వెల్లడించే జాబితాలో ఈ కేటగిరిని అధికారికం చేయనున్నారు…ఇక దీనిపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు.
Also Read : ‘త్రిబుల్ ఆర్’ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?
ఇక తాజాగా ఆస్కార్ కొత్త జాబితాను ప్రకటించే క్రమంలో వాళ్ళు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు…అందులో త్రిబుల్ ఆర్ ఇమేజ్ ను కూడా చేర్చారు. మూడు సినిమాల కలయిక తో ఈ పోస్టర్ ను రెడీ చేశారు…ఈ మూడు పోస్టర్ల కలయిక తో కొత్త కేటగిరి అయిన స్టంట్ డిజైన్ గురించి వెల్లడించారు…
ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్, ఆర్ ఆర్ ఆర్, మిషన్ ఇంపాజిబుల్ సినిమా ల్లోని స్టంట్ ఇమేజ్స్ తో ఈ పోస్టర్ ను రెడీ చేశారు…రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ కి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది.
ఇక ప్రస్తుతం 2027 నుంచి అందుబాటులోకి వస్తున్న స్టంట్ డిజైన్ కేటగిరి మీద రాజమౌళి స్పందిస్తూ వందేళ్ళ నిరీక్షణలో ఆస్కార్ అవార్డు వేడుకలో మన త్రిబుల్ ఆర్ సినిమా పోస్టర్ ను వాడడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అంటూ తన ఆనందాన్ని వెల్లడిస్తున్నాడు. మరి మొత్తానికైతే రాజమౌళి తన తదుపరి సినిమాతో ఆస్కార్ అవార్డుని కొట్టాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి రాజమౌళి అనుకున్నట్టుగా సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది.
Also Read : బీఆర్‌ఎస్.. బీజేపీ మధ్య ట్రిపుల్‌ఆర్ వార్.. ‘నాటు.. నాటు..’కు ఆస్కార్‌తో మాటల యుద్ధం!