Homeఎంటర్టైన్మెంట్Indraja: ఈ వయస్సు లో అదేమీ ఎనర్జీ రా బాబు..'దసరా' స్టెప్పులతో కీర్తి సురేష్ ని...

Indraja: ఈ వయస్సు లో అదేమీ ఎనర్జీ రా బాబు..’దసరా’ స్టెప్పులతో కీర్తి సురేష్ ని డామినేట్ చేసేసిన ఇంద్రజ!

Indraja
Indraja

Indraja: ఇటీవల కాలం లో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఊపేసిన సాంగ్స్ ఏదైనా ఉందా అంటే అది దసరా సాంగ్స్ అనే చెప్పాలి. ఇంస్టాగ్రామ్ రీల్స్ మొత్తం ఎక్కడ చూసిన ‘చమ్కీల అంగీలు వేసి’ అనే సాంగ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. దీనితో పాటు ‘దసరా’ చిత్రం లో పెళ్లి తర్వాత వచ్చే ఒక ఊర మాస్ బీట్ కి కీర్తి సురేష్ వేసిన డ్యాన్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ బిట్ కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.

అయితే ఇప్పుడు మాస్ బీట్ కి ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా దుమ్ము లేపే స్టెప్స్ తో అదరగొట్టేసింది.ప్రతీ ఆదివారం ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం కి జడ్జి గా ఇంద్రజ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాం కూడా పెద్ద హిట్ అయ్యింది.

Indraja
Indraja

ఈ ఆదివారం రోజు ప్రసారం అవ్వబొయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని ఇటీవలే విడుదల చేసారు. ఇందులో ఇంద్రజ దసరా చిత్రం లో కీర్తి సురేష్ డ్యాన్స్ వేసిన బిట్ ని మరో రీ క్రియేట్ చేసింది. ఇంద్రజ డ్యాన్స్ ని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ వయస్సు లో కూడా కీర్తి సురేష్ కంటే స్పీడ్ గా, ఎంతో అందంగా డ్యాన్స్ చేసారని, అందుకే ఇంద్రజ ఇండస్ట్రీ లో లెజండరీ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిపోయారని అంటున్నారు.

ఒకప్పుడు ఈమెకి టాలీవుడ్ లో ఉండే క్రేజ్ మామూలుది కాదు,అప్పట్లో యూత్ మొత్తం ఈమె అంటే పడి చచ్చిపోయేవారు. అయితే పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఇంద్రజ, ఆ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ లో మంచి క్యారెక్టర్స్ చేస్తూ బిజీ గా మారింది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఇలా బుల్లితెర మీద కూడా ఈమె హవా చాల గట్టిగానే నడుస్తుంది.

Sridevi Drama Company Latest Teaser - Coming Soon... -  Rashmi ,Indraja - ETV Telugu

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version