Keerthy Suresh Marriage: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి వార్త ఓ నెల రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. 13 ఏళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్న కీర్తి ఆయన్ని వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. కీర్తి చేసుకోబోయే వ్యక్తి వ్యాపారవేత్త. అతనికి కేరళలో రిసార్ట్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుండి అతనితో కీర్తి పరిచయం ఉంది. కీర్తి క్లాస్ మేట్ కూడాను. ఆ పరిచయం పెద్దయ్యాక ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని కీర్తి భావిస్తున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్ళికి ఒప్పుకున్నారు. త్వరలో కీర్తి సురేష్ వివాహం మీద అధికారిక ప్రకటన రానుందనేది కథనాల సారాంశం.
భారీ ఎత్తున ప్రచారం జరుగుతుండగా కీర్తి సురేష్ తల్లి మేనక స్పందించారు. కీర్తి చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకోబోతున్నారనే పుకార్లను ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన కథనాలు. కీర్తి పెళ్లి ఎవరితో ఫిక్స్ కాలేదు. ఆ రోజు వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటిస్తాము. మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో కీర్తి పెళ్లి పుకార్లకు చెక్ పెట్టినట్లైంది. ఇటీవల కీర్తిపై రూమర్స్ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కొన్ని దారుణమైన అపవాదులు ఆమె మోశారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కీర్తి-అనిరుధ్ తరచుగా కలుస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ప్రేమలో ఉన్నారన్న వాదన మొదలైంది. ఆ వార్తలు మెల్లగా సద్దుమణిగాయి.అనంతరం ఏకంగా పెళ్ళై పిల్లలున్న హీరో విజయ్ తో ఆమెకు ఎఫైర్ అంటగట్టారు. విజయ్-కీర్తి మధ్య ఎఫైర్ నడుస్తుంది. ఈ విషయం తెలిసిన విజయ్ భార్య ఆయనకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కీర్తి కారణంగా కోలీవుడ్ స్టార్ కపుల్ విడిపోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
తాజాగా క్లాస్ మేట్ తో వివాహమన్న ప్రచారం జోరందుకుంది. కీర్తి మాత్రం ఈ పుకార్లపై మౌనం వహిస్తున్నారు. నోరు మెదపడం లేదు. ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. తెలుగులో దసరా, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు. మార్చి 30న దసరా విడుదల కానుంది. నాని హీరోగా నటిస్తున్న దసరా చిత్రంలో వెన్నెల అనే డీగ్లామర్ రోల్ చేసింది కీర్తి. ఇక భోళా శంకర్ మూవీలో చిరంజీవి చెల్లి పాత్ర చేస్తున్నారు. అలాగే తమిళ, మలయాళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.