Keerthy Suresh: సినీ రంగం లో ఒక హీరోయిన్ కెరీర్ దశాబ్దానికి పైగా కొనసాగాలంటే కచ్చితంగా అందాల ఆరబోత చెయ్యాల్సిందే అనే మాటలకు పూర్తి బిన్నంగా ఉండే టాప్ మోస్ట్ హీరోయిన్స్ కూడా ఎంతోమంది ఉన్నారు..వారిలో కీర్తి సురేష్ ఒకరు..బాలనటిగా మలయాళం లో పలు సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగు లో ‘నేను శైలజ’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది..తొలి సినిమాతోనే తన అందం తో పాటుగా నటనతో కూడా యువత మనసుని కొల్లగొట్టిన ఈ మలయాళీ కుట్టి ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని ఏర్పర్చుకుంది.

ఎంత పెద్ద హీరో సినిమాలో అవకాశం వచ్చినా తన పరిధి దాటి ఎన్నడూ ప్రవర్తించలేదు కీర్తి సురేష్..డబ్బులు ఇస్తున్నారు కదా అని విచ్చలవిడిగా అందాలను ఆరబొయ్యడం..ముద్దు సన్నివేశాల్లో నటించడం వంటివి చెయ్యదు..అందుకే కీర్తి సురేష్ ఎంతో స్పెషల్..లేటెస్ట్ గా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట అనే సినిమా చేసింది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది..ఆమె మాట్లాడుతూ ‘మన ప్రవర్తన బట్టే ఈ కాస్టింగ్ కౌచ్ లాంటివి ఇండస్ట్రీ లో జరుగుతాయేమో..నాకైతే ఇప్పటి వరుకు అలాంటి అనుభవం రాలేదు..నేను అవకాశాల కోసం పక్కలో పడుకునే టైపు కాదు..ఒకవేళ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే జాబ్ చేసుకొని బ్రతుకుతాను కానీ నేను నమ్మిన సిద్దాంతాలను విడిచిపెట్టను’ అంటూ మాట్లాడింది..ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఈ మాటలు విన్నాక కీర్తి సురేష్ అభిమానులం అయ్యినందుకు గర్వపడున్నాము అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మన ముందుకి వచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తుంది..ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు గా నటిస్తుంది..దీనితో పాటుగా న్యాచురల్ స్టార్ నాని హీరో గా తెరకెక్కుతున్న దసరా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కీర్తి సురేష్.