Keerthy Suresh: హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ లేటెస్ట్ వీడియో చూసి జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. మహానటిలోని ఈ యాంగిల్ మేము చూడలేదే అని ఆశ్చర్యపోతున్నారు. కీర్తి సురేష్ లుంగీ ఎత్తి కత్తి మాస్ స్టెప్స్ తో దుమ్మురేపగా ఆ వీడియో వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్స్ కి సోషల్ మీడియా పెద్ద ఫ్లాట్ ఫార్మ్. పీఆర్వోలు, చిత్ర యూనిట్స్ దీని ద్వారానే సినిమాలకు ప్రచారం కల్పిస్తున్నారు. తమ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సదరు సినిమా హీరో, హీరోయిన్ మీద కూడా ఉంది. సక్సెస్ కోసం తారలు సైతం సోషల్ మీడియాలో సినిమాలను ప్రమోట్ చేయడానికి వెనకాడటం లేదు. ప్రస్తుతం కీర్తి సురేష్ అదే చేస్తున్నారు.

ఆమె లేటెస్ట్ మూవీ దసరా నుండి ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. దసరా పండగ పురస్కరించుకుని చిత్ర యూనిట్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో హీరో నాని లుంగీ కట్టి దోస్తులతో మందేస్తూ ఊర మాస్ స్టెప్స్ తో ఇరగదీశాడు. దసరా మూవీ ఫస్ట్ సాంగ్ కి విశేష ఆదరణ దక్కింది. సంతోష్ నారాయణన్ స్వరపరచగా… రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కాగా ఈ సాంగ్ కి కీర్తి సురేష్ డాన్స్ చేశారు.
హీరో నాని గెటప్ ఇమిటేట్ చేస్తూ షర్ట్, నిక్కర్, లుంగీ ధరించి స్టెప్స్ వేసింది. లుంగీలో కీర్తి లుక్ సరికొత్తగా ఉంది. గతంలో ఆమెను అలా చూడకపోవడంతో ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఈ డాన్స్ వీడియో కీర్తి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఇక ఆమె ఫాలోవర్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే కీర్తి నువ్వు మాస్ లుక్ లో కేకగా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కీర్తి ఊరమాస్ డాన్స్ వీడియో వైరల్ గా మారింది. ఆ విధంగా కీర్తి తన కొత్త చిత్రానికి ప్రచారం కల్పిస్తుంది.

నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో దసరా చిత్రం తెరకెక్కుతుంది. ఆయన పూర్తి స్థాయి డీ గ్లామర్ రోల్ ట్రై చేస్తున్నారు. నాని కోల్ మైన్స్ లేబర్ గా కనిపిస్తున్నారు. కీర్తి సురేష్ లుక్ ఇంకా రివీల్ చేయలేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల కానుంది. 2023 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. నాని గత చిత్రం ‘అంటే సుందరానికీ’ డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఈ క్రమంలో దసరా మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నాడు. ఈ సినిమా కోసం నాని బాగా కష్టపడుతున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది.
View this post on Instagram