Homeజాతీయ వార్తలుKCR Strategies: బెడిసి కొడుతున్న కేసీఆర్‌ వ్యూహాలు.. ఆవేశపూరిత నిర్ణయాలతో అభాసుపాలు

KCR Strategies: బెడిసి కొడుతున్న కేసీఆర్‌ వ్యూహాలు.. ఆవేశపూరిత నిర్ణయాలతో అభాసుపాలు

KCR Strategies
KCR Strategies

KCR Strategies: దేశం మొత్తం బ్రిటిప్‌ పాలనలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో ఉంది. నిజాం నవాబులు బ్రిటిషర్లకు సామంతులుగా ఉంటూ తెలంగాణను పాలించారు. బ్రిటిషన్ల కంటే మెరుగా నిజాం పాలన సాగింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజాం తన అధీనంలోని తెలంగాణను కూడా భారత్‌లో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అప్పటి వరకు సుపరిపాలన అందించిన నిజాం రాజులో తన రాజ్యం పోతుందన్న అసహనం పెరిగిపోయింది. తన పదవి కాపాడుకునేందుకు పాకిస్తాన్‌లో కలపాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇవేవీ ఫలించలేదు. చివరకు నాటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ నేతృత్వంలో సైనిక చర్యకు రగం సిద్ధమైంది. దీంతో నిజాం అరాచకాలకు దిగాడు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టాడు, నగ్నంగా బతుకమ్మ ఆడించాడు. ఖాసీ రజ్వీ అరాచకాలకు లెక్కేలేకుండా పోయింది. తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్‌ పాలన కూడా అచ్చం నిజాం తరహాలోనే సాగుతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వచ్చే ఎన్నికల్లో తన పార్టీ ఓటమి కాయమని నిర్ధారణకు వచ్చారని అందుకే, నిజాం తరహాలో విపక్షాలపై అచారకాలకు దిగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని విపక్ష నేతలను జైల్లో పెట్టించే ప్రయత్నాలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు.

బెడిసి కొడుతున్న వ్యూహాలు..
తనను కాపాడుకోవడంతోపాటు, విపక్షాలను ప్రజాక్షేత్రంలో చులకన చేయాలని కేసీఆర్‌ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈక్రమంలో అధికార దుర్వినియోగానికి కూడా వెనకాడడం లేదు. చట్టాలను, రాజ్యాంగాన్నిసైతం ఉల్లంఘిస్తున్నారు. అధికారం తనదే కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని, నిజాం తరహాలో అరాచక చర్యలకు దిగుతున్నారన్న విమర్శలు వినిపస్తున్నాయి. అయితే అవి తర్వాత బెడిసి కొడుతున్నాయి. రెండేళ్ల క్రితం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం నుంచి మొన్నటి టెన్త్‌క్లాస్‌ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వరకూ ఆయన విపక్షాలను బదనాం చేసేందుకు అయన చేసిన ప్రయత్నాలు, పన్నిన వ్యూహాలు బూమరాంగ్‌ అయ్యాయి.

బీజేపీతోనే ప్రధాన ముప్పు..
ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్న స్థాయి నుంచి బీజేపీకి చెక్‌ పెట్టకపోతే తనకు మనుగడ లేదనేస్థాయికి కేసీఆర్‌ దిగజారిపోయారు. ఈ క్రమంలోనే బీజేపీని వీలైనంత డ్యామేజ్‌ చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట వేసిన ఎత్తు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బీజేపీ అగ్రనేతలు, మాజీ ఎంపీలు డీకే.అరుణ, జితేందర్‌రెడ్డి లక్ష్యంగా ఈ వ్యూహం వేశారు. ఈ నేతల అనుచరులు మంత్రిపై హత్యాయత్నానికి ప్లాన్‌ చేశారని, వాటిని పోలీసులు భగ్నం చేశారని కొంతమందిని అరెస్ట్‌ చేయించారు. తన అనుకూల మీడియాలో హైప్‌ తెచ్చారు. జితేందర్‌రెడ్డి ఇంటిపై బీఆర్‌ఎస్‌ నేతలతో దాడిచేయించారు. తర్వాత అది అంతా కేసీఆర్‌ ప్రణాళికలో భాగమే అన్న విషయం అర్థమైంది.

– ఇక గతేడాది మోయినాబాద్‌ ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ దూతలు వచ్చారని రచ్చరచ్చ చేశారు. స్టింగ్‌ ఆపరేషన్‌ పేరిట ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ అగ్రనేతలు కుట్ర చేశారని కేసీఆర్‌ స్వయంగా ఆరోపించారు. ఈమేరకు కొన్ని వీడియోలు బయటపెట్టారు. ప్రెస్‌మీట్‌ నిర్వహించి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా వీటిని పంపుతున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత సిట్‌ వేసి బీజేపీ అగ్రనేతలను విచారణ పేరుతో పిలిపించి అరెస్ట్‌ చేయాలని భావించారు. కానీ, కోర్టుల జోక్యంతో ఆ వ్యూహం కూడా బెడిసికొట్టింది. సీబీఐ ఎంట్రీతో ఈ వ్యవహారం అంతా కే సీఆర్‌ మెడకే చుట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే కేసీఆర్‌ సర్కార్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో తాత్కాలిక ఉపశమనం పొందారు.

KCR Strategies
KCR

– తాజాగా టెన్త్‌ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేయించి జైల్లో పెట్టారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు సంజయ్‌ కుట్ర చేశారని కేసు నమోదు చేయించారు. ప్రశ్నపత్రం లీక్‌ చేసినవ్యక్తిని, దానిని షేర్‌ చేసిన వ్యక్తిని కాకుండా, కేసీఆర్‌ ఒత్తిడితో పోలీసులు బండి సంజయ్‌ను ఏ1గా పెట్టారు. అయితే ఈ కేసులోనూ 24 గంటల్లోనే సంజయ్‌కు బెయిల్‌ వచ్చింది. దీంతో ఈ ప్లాన్‌ కూడా ఫెయిల్‌ అయింది.

కూతురు, కొడుకు వ్యవహారాలతో అసహనం..
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత లిక్కర్‌ దందా క్రమంగా బయటకు వస్తోంది. ఇప్పటికే ఈడీ ఆమెను మూడుసార్లు విచారణ చేసింది. ఫోన్లు స్వాధీనం చేసుకుని వాటి డాటా రికవరీ చేసే పనిలో ఉంది. ఈ వ్యవహారమే కేసీఆర్‌కు తలనొప్పిగా మారగా, తాజాగా టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ మరింత ఇబ్బందిగా మారింది. ఈ వ్యవహారంలో కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ హస్తం ఉందన్న విపక్షాల ఆరోపణలు, అందుకు తగ్గట్లుగా కేటీఆర్‌ అసహనానికి గురికావడం, నాకేం సమంబంధం లేదని బుకాయించడం, మరోవైపు ఐటీ మంత్రిగా ఉండి కేవలం ఇద్దరే ఈ కేసులో ఉన్నారని ఆరోపించడంతో ఈ వ్యవహారమొత్తం కల్వకుంట్ల కుటుంబానికి హస్తం ఉందని ప్రజలు విశ్వసించారు. దీంతో కేసీఆర్‌లో అసహనం మరింత పెరిగింది. దీంతో అధికారం చేతిలో ఉందని ఇటు కేసీఆర్, అటు కేటీఆర్‌ అరచకం మొదలు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని చూస్తామని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version