Homeఆంధ్రప్రదేశ్‌KCR- Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేసీఆర్ సంచలనం.. ఏపీ పార్టీలకు...

KCR- Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేసీఆర్ సంచలనం.. ఏపీ పార్టీలకు భారీ షాక్

KCR- Visakha Steel Plant
KCR- Visakha Steel Plant

KCR- Visakha Steel Plant: ఏపీలో పట్టు సాధించేందుకు కేసీఆర్ మరో బ్రహ్మాస్త్రం సంధించారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ముందుకు సాగడానికి డిసైడ్ అయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవడాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు. దీంతో ఇది రాజకీయ ప్రాధాన్యతాంశంగా మారిపోయింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పోరాడుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చిత్తు చేయాలని చూస్తోంది. అదే సమయంలో ఏపీలోని మిగతా రాజకీయ పక్షాలకు షాకివ్వాలని భావిస్తోంది.ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అవకాశంగా మలుచుకోవాలని..
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం పావులు కదుపుతోంది. దీనిపై ఉద్యోగులు, కార్మికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు సైతం నడిచాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. రాష్ట్రంలో అధికార, ప్రధాన విపక్షం కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నాయి. ఇటువంటి సమయంలో బీఆర్ఎస్ విస్తరణకు ఎదురుచూస్తున్న కేసీఆర్ కు సానుకూలాంశంగా కనిపించింది. దీంతో దీనిపై కేంద్రంతో ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ మూలధనం కోసం ఇచ్చిన ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌- ఈవోఐ) బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సింగరేణి లేదా ఖనిజాభివృద్ది సంస్థ పాల్గొనే అవకాశం ఉంది. అయితే, సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా.. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో, బిడ్డింగ్‌ నిర్ణయంపై కేంద్రం నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయో చూడాలి.

మంత్రి కేటీఆర్ లేఖ..
గత కొద్దిరోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని బీఆర్ఎస్ హైప్ చేస్తోంది. ప్రైవేటీకరణ జరుగుతున్న తీరును విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రాన్ని కార్నర్ చేస్తూ ఆరోపణలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ జేఏసీ, ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించి పార్టీ హై కమాండ్ కు నివేదించనున్నారు. త్వరలో కేసీఆర్ తో విశాఖలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అందులో చేయాల్సిన ప్రకటనలు, కార్మికుల అభిప్రాయాలు తెలుసుకొని స్పష్టమైన ప్రకటనలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

KCR- Visakha Steel Plant
KCR- Visakha Steel Plant

రాజకీయంగా ఎదిగేందుకు..
విశాఖ స్టీల్ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. అన్ని రాజకీయ పక్షాలూ మద్దతు తెలిపాయి. అయితే జనసేన అధినేత పవన్ నేరుగా వచ్చి ఉద్యమంలో భాగస్థులయ్యారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ సహకారంతోనే కేంద్ర ఈ దుశ్చర్యకు తెగబడిందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ఇటువంటి సమయంలో విశాఖ స్టీల్ ఉద్యమాన్ని తలకెత్తుకుంటే రాజకీయంగా ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే దీని పోరాడేందుకే డిసైడ్ అయ్యారు. అటు ఏపీలో బీఆర్ఎస్ విస్తరణతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి చెక్ చెప్పవచ్చన్నది కేసీఆర్ భావన. మరి అది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి మరీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular