
NTR- Koratala Siva Movie: ఎన్టీఆర్ డ్యూయల్, ట్రిపుల్ రోల్స్ పలు చిత్రాల్లో చేశారు. వీటిలో కొన్ని ఫలితం ఇవ్వగా మరికొన్ని బెడిసికొట్టాయి. తండ్రి కొడుకులుగా నటించడం మాత్రం ఆయనకు కలిసి రాలేదు. 2004లో విడుదలైన ఆంధ్రావాలా ఆయన కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడు తెరకెక్కించిన చిత్రం ఇది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. తండ్రి పాత్రలో ముంబైలో కూలీగా కనిపిస్తాడు. అక్కడున్న పెద్దలను ఎదిరించి తిరుగులేని శక్తిగా ఎదిగే రోల్ అది.
నాయకుడు మూవీతో పాటు పలు చిత్రాల్లో ఈ పాయింట్ ఉంది. అలాగే సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన చిత్రం. చక్రి సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. విపరీతమైన హైప్ మధ్య విడుదలైన ఆంధ్రావాలా పరాజయం పొందింది. అలాగే శక్తి మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. తండ్రి కొడుకులుగా నటించారు. ఇది డబుల్ డిజాస్టర్.
కలిసిరాని ఈ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడని సమాచారం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపిస్తారట. ఈ మేరకు టాలీవుడ్ లో గట్టి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. అసలే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత వస్తున్న చిత్రం. అదో బ్యాడ్ సెంటిమెంట్. రామ్ చరణ్ ని అది వదల్లేదు. ఆచార్య రూపంలో ఆయనకు ఫ్లాప్ పడింది.

ఆ లెక్కన ఎన్టీఆర్ 30 చిత్రాన్ని రెండు ఫ్లాప్ సెంటిమెంట్స్ వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితిని ఎన్టీఆర్-కొరటాల ఎలా అధిగమిస్తారో చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. నెక్స్ట్ గోవా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.