Kavya Kalyanram : యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ శ్రీలంక వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ పొట్టి బట్టల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు ఫోజులిస్తుంది. కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టింది కావ్య కళ్యాణ్ రామ్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో బాల నటిగా నటించింది. కాగా మసూద చిత్రంతో హీరోయిన్ గా మారింది.
హారర్ జోనర్లో తెరకెక్కిన మాసూద మంచి విజయం సాధించింది. హీరోయిన్ గా ఫస్ట్ మూవీ హిట్ కొట్టింది. ఇక రెండో చిత్రం బలగం సంచలనం అని చెప్పాలి. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం చిత్రం భారీ విజయం అందుకుంది. తెలంగాణ పల్లె సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఎమోషనల్ డ్రామాగా బలగం తెరకెక్కింది. ప్రియదర్శి హీరోగా నటించాడు.
బలగం అనేక అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టడం విశేషం. కావ్య కళ్యాణ్ రామ్ కి కూడా కొన్ని అవార్డులు దక్కాయి. కావ్య కళ్యాణ్ రామ్ కి బలగం గుర్తింపు తెచ్చింది. మూడో విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేయాలన్న అమ్మడు కల నెరవేరలేదు. సింహ కోడూరికి జంటగా ఉస్తాద్ అనే మూవీ చేసింది. ఈ మూవీ అంతగా ఆడలేదు. చెప్పాలంటే కావ్య కళ్యాణ్ రామ్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.ఇతర తెలుగు అమ్మాయిల మాదిరే స్ట్రగుల్ అవుతుంది.
ప్రస్తుతం అమ్మడు చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు లోకల్ భామలను పట్టించుకోరు. కన్నడ, మలయాళ భామలకు ఉన్న డిమాండ్ తెలుగు అమ్మాయిలకు లేదు. ఇక కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. విరామం దొరకడంతో కావ్య శ్రీలంక విహారానికి వెళ్ళింది. తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి