
Kavitha- KCR: సోమవారం ఉదయం 11 గంటలకు వెళ్లాల్సిన కవిత.. 10:30కే ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఆమెతోపాటు భర్త అనిల్ కుమార్, భారత రాష్ట్ర సమితి నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆమెతోపాటు వెళ్లారు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ కవితను మాత్రమే లోపలికి పంపించి, ఆమె భర్త, న్యాయవాది, ఇతర భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులను బయటకు పంపించారు.. ఉదయం దాకా కవిత విచారణకు హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంలో ఉంది. చివరి నిమిషంలో కవిత విచారణకు హాజరై అందరిని ఆశ్చర్యలో ముంచారు.
ఈడి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం రాత్రి కవిత ఢిల్లీ చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్ కుమార్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. వ్యక్తిగత న్యాయవాది సోమ భరత్ కూడా ఆమె వెంట ఉన్నారు. అయితే వాస్తవానికి ఆదివారం రాత్రి నుంచి, సోమవారం ఉదయం వరకు ఆమె న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాదులు కూడా ఆమె చర్చలు జరిపారు. ఆయన ఈడి విచారణకు హాజరు కావాల్సిందేనని సూచించారు.

అయితే కవిత ఉదయం సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. జరుగుతున్న పరిణామాలు మొత్తం ఆయనకు వెల్లడించారు. కెసిఆర్ ఈడి విచారణకు హాజరుకావాలని కవితకు సూచించినట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన డైరెక్షన్లోనే కవిత ఈడి విచారణకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కవిత అరెస్టు జరుగుతుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కెసిఆర్… అవన్నీ ఏమి పట్టించుకోవద్దని.. ధైర్యంగా విచారణకు వెళ్లాలని సూచించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో కవిత ఎపిసోడ్ పార్టీకి డామేజ్ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రగతిభవన్ కు భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చేరుకున్నారు. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే ఏం చేయాలి అనే దానిపై కూడా తీవ్రంగా చర్చిస్తున్నారు. మరోవైపు ఈడి ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. కేంద్ర బలగాలు అక్కడ పహారా కాస్తున్నాయి. కన్ ఫ్రంటేషన్ విధానాల్లో విచారణ జరగనున్న నేపథ్యంలో అక్కడ మీడియా కూడా అనుమతించడం లేదు. సోమవారం ఉదయం కవిత విచారణకు హాజరైన నేపథ్యంలో ఢిల్లీ ఈ డి ఆఫీస్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.