
S. S. Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ఆస్కార్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు అస్కార్ అవార్డు రావడంతో ఆయన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాజమౌళి గురించి ప్రత్యేక కథనాలు మీడియాలో ఆసక్తిని రేపుతున్నారు. ఇవి ఆయన పర్సనల్ విషయాలను టచ్ చేస్తుండడంతో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. తాజాగా జక్కన్న చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన మతం గురించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది.
రాజమౌళి నాస్తికుడని సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మందికి తెలుసు. కానీ ఆయన తీసే సినిమాలను చూస్తే అలా అనిపించదు. రామాయణం, మహాభారతం లాంటివి తనపై ప్రభావం చూపాయని, వాటి ఆధారంగనే సినిమాలు తీస్తున్నానని పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మతాన్ని నమ్ముతారా? లేదా? అనేది అయోమయంగా ఉంది. అయితే ఆస్కార్ అవార్డు అందుకునే క్రమంలో అమెరికాకు వెళ్లి వచ్చిన తరువాత న రాజమౌళి ఓ విదేశీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మతంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలను వదిలారు.
రాజమౌళి గతంలో దేవుళ్లను ఎక్కువగా పూజించేవారట. ఎక్కువగా భక్తిభావాలు కలిగిన ఆయన కొన్ని కారణాల వల్ల మతపరమైన చిక్కుల్లో పడ్డారట. ఆ తరువాత సన్యాసిగా మారాడు. కొన్నాళ్లపాటు ఇలా గడిపిన తరువాత చివరికి క్రైస్తవ మతాన్ని అనుసరించానని చెప్పారు. బైబిల్ చదువుతూ చర్చికి వెళ్లి వచ్చేవాడినని రాజమౌళి చెప్పారు. అయితే ఇవన్నీ చేసిన తరువాత మతం అనేది ఒక దోపిడి అని అర్థమైందని ఆయన అన్నారు. అందుకే ఏ మతాన్ని నమ్మకుండా నాస్తికుడిగా మారిపోయానని జక్కన్న చెప్పుకొచ్చారు.

అయితే రాజమౌళి కుటుంబ సభ్యులు అందరూ హిందు దేవుళ్లను పూజిస్తారట. నిత్యం పూజలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారట. కానీ రాజమౌళి మాత్రం ఇలాంటి కుటుంబం నుంచి వచ్చినా నాస్తికుడిగా మారడం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ఇక రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై మతం దోపిడి అనేది కరెక్ట్ కాదని మతాన్ని నమ్మేవారు విమర్శిస్తున్నారు.