
Brides Swapped During Power Cut : కరెంటు కోత వారిని కకావికలం చేసింది. వారు చేసుకున్న పెళ్లి వారికి సంతోషం కలిగించడం మాట అటుంచితే ఆందోళన పెంచేలా చేసింది. చీకటిలో పెళ్లి కూతుళ్లు మారిపోయి చివరకు గొడవకు దారి తీసింది. తాను చూసింది ఓ అమ్మాయి. తాళి కట్టింది మరో అమ్మాయి కావడంతో పెళ్లికొడుకుకు షాక్ తగిలింది. పెళ్లి కూతురు మారిపోవడంతో అత్తగారి మీద రుసరుసలాడాడు. తనకు తెలియకుండా తనకు ఇంకొకరితో పెళ్లి చేయడంపై గుర్రుగా ఉన్నాడు. విషయం తెలియడంతో ఇద్దరి శోభనాలు ఆపి మళ్లీ ఎవరికి వారే చేసుకునేలా చేశారు. అచ్చం సినిమా కథనంలా అనిపించే ఈ స్టోరీ వింటే మనకు కూడా ఆశ్చర్యం కలగక మానదు.
నేపథ్యం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లాలో ఓ తండ్రికి ఇద్దరు కూతుళ్లున్నారు. ఇద్దరి పెళ్లి ఒకేసారి చేయాలని భావించాడు. ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూశాడు. వారికి నచ్చిన వారినే భర్తలుగా చేయడానికి అంగీకరించాడు. వారికి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిపించాడు. ఇక పెళ్లి కూడా ఒకే రోజు కుదిరింది. దీంతో భోజనాలు కలిసొస్తాయని వివాహం కుదిర్చారు. ఏర్పాట్లు ఘనంగానే చేశాడు. ఇక పెళ్లి తంతు రానే వచ్చింది. ఇద్దరిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు.

ఇక్కడే ట్విస్ట్
తాళి కట్టే సమయానికి సరిగా పది నిమిషాల ముందు కరెంటు పోయింది. దీంతో కరెంట్ ఆఫీసుకు ఫోన్ చేస్తే కరెంటు ఇప్పుడే రాదని చెప్పడంతో ఇక ఏం చేయలో తోచలేదు. చీకటిగా ఉండటంతో పెళ్లి కూతుళ్లు కూడా లేచి కాసేపు గాలి కోసం బయటకు వెళ్లారు. తరువాత వచ్చి పెళ్లిపీటల మీద కూర్చున్నారు. కానీ ప్లేసులు మారాయి. దీంతో పెళ్లికొడుకులు మారిపోయారు. తాళి కట్టాక పెళ్లి తంతు పూర్తయింది. అదే రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఇంతకీ ఏం జరిగింది?
పెళ్లి కూతుళ్లు మారిపోయారు. ఒకరు చేసుకోవాల్సింది మరొకరు చేసుకున్నారు. శోభనం రోజు ముసుగు తీయడంతో పెళ్లి కొడుకు ఆశ్చర్యపోయాడు. వదినకు తాళి కట్టానని తెలుసుకుని అక్కడ మొదటి రాత్రి ఆపాలని అత్తకు ఫోన్ చెప్పాడు. దీంతో శోభనం వాయిదా పడింది. ఇరు కుటుంబాలు పంచాయితీ పెట్టుకుని ఎవరి భార్యను వారు గుల్లో మళ్లీ చేసుకున్నారు. కరెంటు కోత ఎంత పని చేసింది. పెళ్లి కూతుళ్లనే మార్చేసింది. దీనికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.