https://oktelugu.com/

Oscars 2023 RRR : ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కు కశ్మీర్ ఫైల్స్ గట్టి పోటీ!

Oscars 2023 RRR : బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి ‘RRR’ భారత్ కు మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తీసుకురావడం ఖాయమని అంటున్నారు. గత 21 సంవత్సరాలలో భారతదేశానికి మొదటి ఆస్కార్ నామినేషన్‌ను తీసుకురావడానికి ఆర్ఆర్ఆర్ సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. రూ. 200 కోట్లతో అరంగేట్రం చేసి రూ. 1100 కోట్లకు పైగా జీవితకాల కలెక్షన్లతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం 2023లో జరగబోయే అకాడమీ అవార్డ్స్‌లో ఫ్రంట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 18, 2022 / 01:34 PM IST

    Oscars 2023 RRR

    Follow us on

    Oscars 2023 RRR : బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి ‘RRR’ భారత్ కు మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తీసుకురావడం ఖాయమని అంటున్నారు. గత 21 సంవత్సరాలలో భారతదేశానికి మొదటి ఆస్కార్ నామినేషన్‌ను తీసుకురావడానికి ఆర్ఆర్ఆర్ సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. రూ. 200 కోట్లతో అరంగేట్రం చేసి రూ. 1100 కోట్లకు పైగా జీవితకాల కలెక్షన్లతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం 2023లో జరగబోయే అకాడమీ అవార్డ్స్‌లో ఫ్రంట్ రన్నర్స్‌లో ఒకటిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ -జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ కు… జేమ్స్ కామెరూన్ యొక్క యాక్షన్ సెన్సిబిలిటీలు.. జార్జ్ మిల్లర్ యొక్క ప్రతిష్టాత్మక స్కోప్ ఉన్నట్లు ఆస్కార్ నిపుణులు చెబుతున్నారు. గోల్డెన్ ట్రోఫీని ఇంటికి తీసుకురావడానికి ఆర్ఆర్ఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని అంటున్నారు.

    ఇప్పటికే ఆస్కార్ పోటీదారులుగా కొరియా ‘డిసిషన్ టు లీవ్’, మెక్సికో దేశానికి చెందిన ‘బార్డో’ వంటి ఇతర అంతర్జాతీయ చిత్రాలున్నాయి. ‘RRR’ కేవలం ఉత్తమ విదేశీ చిత్రం కోటాలో పోటీపడబోతోందని తెలుస్తోంది.. ఇతర అంతర్జాతీయ ఆశావహుల నుండి పోటీ ఉంటుందని.. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యులకు చివరికి అవార్డుల విషయంలో రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తాయి’ అని నివేదికలు పేర్కొంటున్నాయి.

    ఇర్ఫాన్ ఖాన్ ,నిమ్రత్ కౌర్ నటించిన విమర్శకుల ప్రశంసలు పొందిన ‘ది లంచ్‌బాక్స్’ 2013లో అధికారిక ఆస్కార్ ఎంట్రీగా నిలిచింది. ఈ హిందీ చిత్రాన్ని పుష్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ‘RRR’ అనే తెలుగు భాషా చిత్రం కూడా బరిలో పుష్ చేయాల్సిన అవసరం ఉంటుందని నివేదిక పేర్కొంది.

    ఆస్కార్ రేసులో కాశ్మీర్ ఫైల్స్ కూడా ఉంది. వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ చిత్రం ఆస్కార్‌కు భారతదేశం నుంచి సమర్పించే చిత్రాల్లో ఖచ్చితమైన అవార్డు వచ్చే చిత్రం అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ ను కూడా ఇండియా నుంచి పంపిస్తే అవార్డు గ్యారెంటీ. ఈ రెండింటిలో దేన్ని పంపిస్తారు? దేనికి అవార్డ్ వస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

    ‘RRR’ పైచేయి సాధిస్తే, చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని 15 ఉత్తమ అంతర్జాతీయ చిత్రాల విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయడానికి ప్రచారాన్ని ప్రారంభించాలి. అంతే కాదు కొరియా యొక్క ‘పారాసైట్’ లాగా, ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడి కేటగిరీలతో సహా ఇతర సాధారణ విభాగాలలో కూడా ఈ చిత్రాన్ని సమర్పించవచ్చు.