కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెళ్లి చేసుకునే అమ్మాయిలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. బ్రాహ్మణ యువకులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 3 లక్షల రూపాయలు ఇస్తామని కీలక ప్రకటన చేసింది. మైత్రి అనే పేరుతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆలయాల్లో అర్చకత్వం చేసే బ్రాహ్మణ యువకులకు పెళ్లి చేసుకునే యువతులు ఈ పథకానికి అర్హులు. అర్చకులు, పురోహితులతో వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
Also Read: రావి చెట్టుకు పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
కర్ణాటక రాష్ట్రానికి సీఎంగా ఉన్న యడ్యూరప్ప కొన్నిరోజుల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించారు. కర్ణాటక ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదే సమయంలో నిరుపేద బ్రాహ్మణ యువతులను పెళ్లి చేసుకునే యువకులకు మైత్రీ పథకం ద్వారా 25 వేల రూపాయల నగదు అందనుంది. రాష్ట్ర బ్రాహ్మణ అభివృద్ధి బోర్డు చైర్మన్ సచ్చిదానంద మైత్రి పథకం గురించి మీడియాకు వెల్లడించారు.
Also Read: శివుని కంఠం ఎందుకు నీలి రంగులో ఉంటుందో తెలుసా?
అయితే ప్రభుత్వం 3 లక్షల రూపాయలను పురోహితులు, అర్చకులను పెళ్లి చేసుకున్న యువతులకు బాండ్ రూపంలో ఇస్తుంది. పెళ్లి జరిగిన మూడు సంవత్సరాల తరువాత బాండ్ ను నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మైత్రి స్కీమ్ ద్వారా బ్రాహ్మణులకు మరికొన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అర్చకులుగా మాత్రమే కాకుండా వ్యవసాయం చేసే రైతులకు సైతం ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలు లభిస్తాయి.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
ఎకరం కంటే తక్కువ పొలం ఉన్న బ్రాహ్మణ యువకులకు బోరుబావి తవ్వించుకోవడం కోసం, పాడి పరిశ్రమ కోసం, ట్రాక్టర్ ను కొనుగోలు చేయడం కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందుతుంది.