
ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నా ప్రముఖులు మాత్రం వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇటీవల ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో తనను ఇటీవల కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు.