ఎన్నికల వేళ మమతకు షాక్‌ల మీద షాక్‌లు

పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలంతా వరుసగా బైబై చెబుతున్నారు. ఒక్కొక్కరుగా రాజీనామాలు సమర్పిస్తూ పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. Also Read: ఏపీలో దేవాలయాలపై దాడులు.. కేంద్రం జోక్యం? తాజాగా మరో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి లక్ష్మీ […]

Written By: Srinivas, Updated On : January 6, 2021 10:57 am
Follow us on


పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలంతా వరుసగా బైబై చెబుతున్నారు. ఒక్కొక్కరుగా రాజీనామాలు సమర్పిస్తూ పార్టీ నుంచి తప్పుకుంటున్నారు.

Also Read: ఏపీలో దేవాలయాలపై దాడులు.. కేంద్రం జోక్యం?

తాజాగా మరో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సంబంధిత రాజీనామా పత్రాన్ని సీఎం మమతా బెనర్జీతో పాటు.. ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌కు కూడా పంపారు. అయితే.. మంత్రి పదవితో పాటు త్వరలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

బెంగాల్ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్ అయిన లక్ష్మీ రతన్ శుక్లా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున హౌరా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇదిలాఉండగా.. రెండు వారాల క్రితమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సువెంధు అధికారి తన మంత్రి పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలా తృణమూల్‌ను వీడిన సువెంధు అధికారి బీజేపీలో చేరారు. ఇప్పుడు లక్ష్మీ రతన్ శుక్లా కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

Also Read: సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్.. ఎవరు చేశారు? ఎందుకు?

మొత్తంగా ఈసారి బీజేపీ పశ్చిమబెంగాల్‌లో పాగా వేయాలని దృఢసంకల్పంతో ఉంది. అందుకే.. ఒక్కొక్కరిని మమత పార్టీ నుంచి లాగుతున్నట్లుగా అర్థమవుతోంది. ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్‌ అయితే వెలువడలేదు. అప్పుడే వలసలతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ఇక నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయి నామినేషన్ల పర్వం మొదలయ్యే సరికి ఇంకా ఎన్ని వలసలు ఉంటాయో.. రాజకీయాలు ఎటు మలుపు తిప్పుతాయో తెలియకుండా ఉంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్