Homeట్రెండింగ్ న్యూస్Karnataka Bride: మేకప్ కొంప ముంచింది...l వధువును చూసి వరుడు షాక్.. పెళ్లి క్యాన్సిల్!!

Karnataka Bride: మేకప్ కొంప ముంచింది…l వధువును చూసి వరుడు షాక్.. పెళ్లి క్యాన్సిల్!!

Karnataka Bride
Karnataka Bride

Karnataka Bride: పెళ్లి చేసుకుంటున్నా అన్న సంతోషం.. ఫొటోల్లో క్యూట్ గా కనిపించాలి అనే కోరిక.. బంధువులకు, స్నేహితులు తనను చూసి ఆశ్చర్య పోవాలన్న అత్యాశ ఆ అమ్మాయి కొంప ముంచింది. అందంగా కనిపించాలన్న ఆమె ప్రయత్నం ప్రాణాలమీదకు తెచ్చింది. అందం కోసం యువతి అత్యాశ.. ఓ బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్వాకంతో పెళ్లి ఆగిపోవడమే ఆమె హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది.

అందం కోసం ప్రయత్నిస్తే పెళ్లే ఆగింది..
శుభకార్యం ఏదయినా అమ్మలక్కలు అందగా ముస్తాబయివుతుంటారు. ఇక పెళ్లి తనదే అయితే ఆ అమ్మాయి అందరికంటే అందంగా ఉండాలని తెగ రెడీ అవుతుంది. ఇందుకోసం ఎప్పుడూ వెళ్లని అమ్మాయిలు కూడా బ్యాటీ పార్లర్లకు వెళుతుంటారు. బ్యూటీషియన్ ను ఇంటికే తప్పించుకుంటున్నారు. అయితే ఓ బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్వాకంతో అందంగా మారాల్సింది పోయింది అందవికారంగా తయారయ్యిందో యువతి. దీంతో కొద్దిరోజుల్లో జరగాల్సిన పెళ్లి ఆగి పోయింది.

అనుకున్నది ఒకటి.. అయింది ఇంకోటి..
హసన్ జిల్లాకు చెందిన ఓ యువతి కొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సి వుంది. ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. పెళ్లిలో అందంగా కనపించేందుకు యువతి ఓ బ్యూటీ పార్లర్ ను ఆశ్రయించింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

ఆవిరి ముఖం వాచిపోయింది..
మేకప్ లో భాగంగా బ్యూటీ పార్లర్ సిబ్బంది యువతి ముఖానికి ఆవిరి పడుతుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆవిరి ఎక్కువై ఆ వేడికి యువతి ముఖమంతా వాచిపోయిది. అందం ఏమో కానీ అందవికారంగా తయారయ్యింది. ముఖమంతా నల్లగా మారింది. కళ్లు, బుగ్గలు వాచిపోయి రూపం మొత్తం మారిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాధారణ స్థితికి రావడానికి సమయం పదుతుందని డాక్టర్లు తెలిపారు.

Karnataka Bride
Karnataka Bride

పెళ్లి క్యాన్సిల్..
అందవికారంగా తయారయిన యువతిని చూసి పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు కంగుతున్నాడు. ఆ యువతిని పెళ్ళాడబోనని… పెళ్లి నిలిపివేస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. ఇప్పటికే కూతురికి ఇలా అయ్యిందని బాధపడుతున్న తల్లిదండ్రులకు వరుడి నిర్ణయం మరింత షాక్ కు గురిచేసింది. ఎంత సర్దిచెప్పినా యువకుడు మాత్రం పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులకు ఏం చేయాలో అర్థంకావడం లేదు. ఎంతో ఆనందోత్సాహాలతో సందడిగా వుండాల్సిన ఇళ్లు ఓ బ్యూటీ పార్లర్ సిబ్బంది నిర్వాకంతో బోసిపోతోంది.

ఈ ఘటన ఇప్పుడు అందంగా కనిపించేందుకు ప్రతిసారీ బ్యూటీపార్లర్లను ఆశ్రయించే వారిని ఆలోచింపజేస్తోంది. మేకప్ పేరిట అడ్డమైన కెమికల్స్ తో కూడిన రంగులు ముఖానికి అద్దుకోవడం మంచిది కాదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయినా మహిళలు మారకపోవడంతో వీధివీధికి బ్యూటీపార్లర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version