
Amigos Collections: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నందమూరి కుటుంబ హీరోలందరూ హిట్స్ మీద మంచి ఊపు మీదున్నారు, ‘బింబిసారా’ చిత్రం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ అయ్యింది, ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఆడుతుందని అంచనా వేసి ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు బయ్యర్స్.
Also Read: Kotamreddy Sridhar Reddy: ట్రోల్ ఆఫ్ ది డే: అడ్డంగా దొరికిపోయిన కోటం హాసన్
టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం నిల్. ఓటీటీ రాజ్యం ఏలుతున్న సమయంలో థియేటర్స్ కి ప్రేక్షకులు కదలాలి అంటే కచ్చితంగా టీజర్ – ట్రైలర్ వాళ్ళని అఆకట్టుకునే ఉండాలి, మూవీ మీద హైప్ తీసుకొని రావాలి. లేకపోతే ఓపెనింగ్స్ నుండి క్లోసింగ్ వరకు కలెక్షన్స్ విషయం లో నిరాశ చెందాల్సి వస్తుందని ట్రేడ్ పండితులు మొదటి నుండి చెప్తూ వస్తున్న మాటలను ఈ చిత్రం నిజం చేసింది.
మొదటి రోజు ఈ చిత్రానికి రెండు కోట్ల 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి వస్తుందని అంచనా వేశారు కానీ వరల్డ్ వైడ్ కలిపి వచ్చింది, రెండవ రోజు అయితే మరీ దారుణం మొదటి రోజుకంటే 50 శాతం వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా కోటి 10 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది,కానీ మూడవ రోజు ఆదివారం అవ్వడంతో ఈ చిత్రానికి కాస్త కలిసొచ్చి కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అలా మూడు రోజులకు కలిపి 5 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా నాలుగో రోజుకు వచ్చేసరికి కలెక్షన్స్ మొత్తం డౌన్ అయిపోయాయి.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే.. ఈ చిత్రం నాలుగో రోజు కేవలం 50 లక్షల రూపాయిల షేర్ మాత్రమే రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.’బింబిసారా’ చిత్రానికి కేవలం మొదటి రోజే 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి, కానీ ‘అమిగోస్’ నాలుగు రోజులకు కూడా ఆ కలెక్షన్స్ ని అందుకోలేక పోవడం విశేషం.
Also Read: Telangana Secretariat: సచివాలయం ప్రారంభోత్సవం ఆగిపోవడానికి అసలు కారణాలు ఇవా?