
China Sperm Donation: సృష్టికి మూలం ప్రాణమే. ప్రాణాన్ని నిలిపేది వీర్యం నుంచి శుక్రకణమే. చిన్న అణువులాంటి పదార్థం ఒక ప్రాణాన్ని కనిపెడుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో వీర్యానికి ఉండే విలువ అలాంటిది. చాలా దేశాల్లో వీర్య దాతలు ఉన్నారు. గతంలో అమెరికాలో ఓ కుర్రాడు తన వీర్యాన్ని చాలా మందికి దానం చేసిన ఘటన తెలిసిందే. ప్రస్తుతం చైనా దేశంలో కూడా వీర్య దాతలకు భలే డిమాండ్ ఏర్పడుతోంది. ఇటీవల కాలంలో వీర్య కణాల సంఖ్య తగ్గుతోంది. చాలా జంటలు సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. ఫలితంగా వంధ్యత్వం బారిన పడుతున్నారు. సంతాన సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ అంశంపై హిందీలో విక్కీ డోనార్, తెలుగులో నరుడా డోనరుడా వంటి సినిమాలు వచ్చాయి.
Also Read: Kotamreddy Sridhar Reddy: ట్రోల్ ఆఫ్ ది డే: అడ్డంగా దొరికిపోయిన కోటం హాసన్
జనాభా క్రమంగా..
జనాభా నియంత్రణ కోసం చైనా నిబంధనలు విధించడంతో జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం యువత పెళ్లి చేసుకునేందుకు ఆలస్యం చేస్తున్నారు. జీవితంలో సెటిల్ అయ్యాకే వివాహం చేసుకునేందుకు మొగ్గు చూపడంతో జనాభా ఉత్పత్తి తగ్గుతోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన చైనా జనాభాను వృద్ధి చేసే చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగానే వీర్య కణాలను దానం చేసిన వారికి భారీ నజరానా ప్రకటిస్తోంది. దీనికి ముందుకు వచ్చే వారికి కొన్ని అర్హతలు కూడా పెడుతోంది.
20 నుంచి 40 ఏళ్ల..
వీర్య కణాలను దానం చేసే వారికి 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 165 సెంటిమీటర్ల ఎత్తు ఉండాలి. డిగ్రీ చదివిన వారు కావాలి. ఆరోగ్యవంతులైతేనే సుముఖత. తగిన అర్హతలు ఉన్న వారు 8-12 సార్లు వీర్యం దానం చేస్తే 4500 యూవాన్లు భారత కరెన్సీలో రూ. 55 వేలు పొందొచ్చు. ఇలా వీర్య కణాలు ఇవ్వాలనుకునే వారికి అర్హతలు నిర్ణయించింది. ఈ మేరకు అన్ని అర్హతలు ఉన్న వారు ముందుకొచ్చి వీర్యం దానం చేయొచ్చని సూచిస్తోంది. దీనికి సిద్ధమైన వారు సంప్రదించాలని చెబుతోంది.
ఈ లక్షణాలుంటే..
వీర్యం దానం చేసే వారికి దృష్టి లోపం ఉండరాదు. బీపీ వంటి అనారోగ్యం ఉండొద్దు. పొగతాగే అలవాటు వద్దు. మద్యం సేవించే వారు దూరమే. ఈ క్రమంలో వీర్యం దానం చేసే వారికి పై అలవాట్లు ఉండకూడదని సూచిస్తోంది. గతంలో జనాభా నియంత్రణకు చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో జనాభా క్రమంగా తగ్గిపోయింది. దీంతో దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. స్పెర్మ్ కౌంట్ బ్యాంకులు వెలుస్తున్నాయి. మన దేశంలో కూడా ఇలాంటి బ్యాంకులు అందుబాటులోకి వస్తున్నాయి.

డ్రాగన్ పథకం ఫలించేనా?
వీర్య దాతల వివరాలు గోప్యంగా ఉంచుతారు. అందరికి తెలియనివ్వరు. వీర్య దానాన్ని సంపదగా భావిస్తున్నారు. భావి తరానికి ఇది ముఖ్యమైనదిగా చెబుతున్నారు. దేశంలో జనాభా నియంత్రణకు చర్యలు తీసుకున్న డ్రాగన్ ఇప్పుడు వృద్ధి చేయడానికి కూడా ఓ యుద్ధం చేయడానికే నిర్ణయించుకుంది. వీర్యాన్ని సేకరించి దాంతో జనాభాను పెంచుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. దీని కోసం వీర్యదాతల నుంచి సేకరించి బ్యాంకుల్లో నిలువ ఉంచుతోంది. దీని ద్వారా జనాభాను మరింత పెంచుకోవాలని సంకల్పిస్తోంది.
Also Read:Kethamreddy Vinod Reddy: మొన్న మహాసేన రాజేశ్.. నేడు కేతం రెడ్డి.. జనసేన నుంచి టీడీపీ లాగేస్తోందా?