Daaku Maharaj in OTT
Daaku Maharaj : వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నుండి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ చిత్రం ‘డాకు మహారాజ్(Daaku Maharaj)’. డైరెక్టర్ బాబీ(Director Bobby) తెరకెక్కించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. పండగ సెలవుల్లో భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆ తర్వాత వసూళ్ల పరంగా బాగా నెమ్మదించినప్పటికీ, ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్కును మాత్రం ఈ చిత్రం అందుకొని బాలయ్య కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిల్చింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీ వాసూవల్లను రాబడుతూ ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టడం ‘డాకు మహారాజ్’ చిత్రానికి పెద్ద మైనస్ అయ్యింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా హైర్స్ తో కలిపి ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య వింటేజ్ మాస్ యాక్షన్ ని మరోసారి చూడాలని తపిస్తున్నారు. థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిపోయింది కదా, కచ్చితంగా ఈ చిత్రం ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కారణం నిర్మాతలు ఈ చిత్రాన్ని అప్పుడే ఓటీటీ లోకి విడుదల చేయడానికి అనుమతించకపోవడం వల్లే. ఎందుకంటే నిర్మాతల కౌన్సిల్ లో కచ్చితంగా ఈ చిత్రాన్ని 50 రోజుల తర్వాతే విడుదల చేయాలనీ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని తూచా తప్పకుండ అనుసరించాల్సిందే అని నిర్మాతలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారట. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. తెలుగు తో పాటు హిందీ, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది.
ప్రస్తుతం ఇతర భాషలకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుతున్నారట. బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడం తో శివరాత్రి రోజునే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక బాలయ్య తదుపరి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సీక్వెల్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సరైనోడు’ లో విలన్ గా చేసిన ఆది పినిశెట్టి, ఈ సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నాడు.