
దేశీయ టెలీకాం దిగ్గజం జియో కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నో సంచలనాలను సృష్టించి వార్తల్లో నిలిచిన జియో అతి త్వరలో అదిరిపోయే ఆఫర్ తో జియో ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. 1,999 రూపాయల ధరతో జియో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. న్యూ జియో ఫోన్ 2021 పేరుతో జియో అందుబాటులోకి తెస్తున్న ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రెండు సంవత్సరాల పాటు ఫ్రీ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను పొందవచ్చు.
Also Read: వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజ్ లను చదవొచ్చు.. ఎలా అంటే..?
అదే సమయంలో నెలకు 2జీబీ డేటా చొప్పున రెండు సంవత్సరాల్లో 48 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వాళ్లు ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండా ఫోన్ ను ఉపయోగించుకోవచ్చు. న్యూ జియో ఫోన్ ను రూ.1,499కే కొనుగోలు చేసే వాళ్లు ఏడాది అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు నెలకు 2జీబీ ఫ్రీ డేటాను పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జియో ఫోన్ ను వాడుతున్న యూజర్లు 749 రూపాయల రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ కాల్స్, నెలకు 2జీబీ డేటాను పొందవచ్చు.
Also Read: ‘ఉప్పెన’ హీరోయిన్ తో సుధీర్ ప్రేమ
మార్చి నెల 1వ తేదీ నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం జియో ఫీచర్ ఫోన్ యూజర్లు 100 మిలియన్ల మంది ఉండగా ఈ సంఖ్యను 300 మిలియన్లకు పెంచుకోవడమే లక్ష్యంగా జియో కొత్త ఆఫర్లను తెచ్చినట్టు తెలుస్తోంది. దేశంలో 4జీ సౌకర్యం ఉన్న తొలి ఫీచర్ ఫోన్ అయిన జియో కియోస్ మీద రన్ అవుతోంది. 2017 సంవత్సరంలో మొదట ఈ ఫోన్ లాంఛ్ అయింది.
మరిన్ని వార్తలు కోసం: వైరల్
యూట్యూబ్, వాట్సాప్ లాంటి యాప్స్ ను సపోర్ట్ చేయడం ఈ యాప్ ప్రత్యేకత. మరోవైపు జియో తక్కువ ఖర్చుతో ఆండ్రాయిడ్ ఫోన్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. గూగుల్ భాగస్వామ్యంతో జియో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తోంది.