https://oktelugu.com/

Janhvi Kapoor: అతిపెద్ద సమస్యలో జాన్వీ కపూర్… హీరో రానా హెల్ప్!

Janhvi Kapoor: శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అతిపెద్ద సమస్యలో ఇరుక్కున్నారు. తన బాధను హీరో రానాతో చెప్పుకున్నారు. ఆయన జాన్వీ ఇబ్బందిని క్షణాల్లో తీర్చేశారు. ఇంతకీ జాన్వీ కపూర్ కి వచ్చిన సమస్య ఏంటంటే… ఆమె వెనుక ఫ్యాషన్ పోలీసులు పడుతున్నారట. ఎప్పుడు ఎయిర్ పోర్ట్లో కనిపించినా ఈ ఫ్యాషన్ పోలీసులు(మీడియా) వెనుకపడి వేధిస్తున్నారట. వారి నుండి తనను కాపాడాలని, తన సమస్యకు పరిష్కారం చూపాలని జాన్వీ కోరుకుంది. జాన్వీ సమస్యను రానా రెండే రెండు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 6, 2023 / 10:22 AM IST
    Follow us on

    Janvhi Kapoor-Rana

    Janhvi Kapoor: శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అతిపెద్ద సమస్యలో ఇరుక్కున్నారు. తన బాధను హీరో రానాతో చెప్పుకున్నారు. ఆయన జాన్వీ ఇబ్బందిని క్షణాల్లో తీర్చేశారు. ఇంతకీ జాన్వీ కపూర్ కి వచ్చిన సమస్య ఏంటంటే… ఆమె వెనుక ఫ్యాషన్ పోలీసులు పడుతున్నారట. ఎప్పుడు ఎయిర్ పోర్ట్లో కనిపించినా ఈ ఫ్యాషన్ పోలీసులు(మీడియా) వెనుకపడి వేధిస్తున్నారట. వారి నుండి తనను కాపాడాలని, తన సమస్యకు పరిష్కారం చూపాలని జాన్వీ కోరుకుంది. జాన్వీ సమస్యను రానా రెండే రెండు నిమిషాల్లో తీర్చేశాడు. పైలట్ కి వార్నింగ్ ఇచ్చి జాన్వీని నేరుగా ఇంటి దగ్గర పికప్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే ఏర్పాటు చేశాడు.

    Janvhi Kapoor

    ఏంటిదంతా అనిపిస్తుంది కదా… ఇది రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషనల్ వీడియో. రానా నాయుడు టీమ్ జాన్వీ కపూర్ హెల్ప్ తీసుకున్నారు. జాన్వీ-రానాల మీద ఒక ప్రమోషనల్ వీడియో షూట్ చేశారు. రానా నాయుడు సిరీస్లో రానా క్యారెక్టర్ థీమ్ తెలియజేస్తూ ఈ ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. మార్చి 10 నుండి నెట్ఫ్లిక్స్ లో రానా నాయుడు స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ నందు రానా ప్రొఫెషనల్ ఫిక్సర్ రోల్ చేస్తున్నారు.

    Also Read: Aditi Rao Hydari: ఆ స్టార్ హీరోతో సహజీవనంలో అలా ఎంజాయ్ చేయడం నాకెంతో ఇష్టమన్న హీరోయిన్

    సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన సెలబ్రిటీ ఎవరైనా కానీ… లీగల్ లేక ఇల్లీగల్ ప్రాబ్లెమ్స్ లో ఇరుక్కుంటే రానా రంగంలోకి దిగుతాడు. సామ దాన దండోపాయాలు వాడి ప్రాబ్లం నుండి బయటపడేస్తాడు. ఇక వెంకటేష్ ఆయన తండ్రి పాత్ర చేస్తున్నారు. తండ్రీ కొడుకుల మధ్య జరిగే ప్రధాన ఘర్షణే రానా నాయుడు వెబ్ సిరీస్. హాలీవుడ్ సక్సెస్ సిరీస్ రే డొనోవన్ కి ఇది అధికారిక రీమేక్.

    ఫస్ట్ టైం వెంకటేష్-రానా కలిసి నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుంది. రానా నాయుడు సక్సెస్ తో సౌత్ ఇండియాలో భారీగా సబ్స్క్రైబర్స్ ని పొందాలని చూస్తుంది. ఇండియాలో నెట్ఫ్లిక్స్ స్ట్రగుల్ అవుతుంది. ఇంటర్నేషనల్ కంటెంట్ తో పాటు ఇండియన్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నా చందాదారులు పెరగడం లేదు. సబ్స్క్రిప్షన్ చార్జెస్ కూడా తగ్గించినట్లు సమాచారం. రానా నాయుడు సిరీస్లో వెంకీ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంది. ఆయన ఏకంగా బూతులు మాట్లాడుతున్నారు. క్యారెక్టర్ కోసం తప్పలేదని ఇటీవల ఆయన వివరణ ఇచ్చారు.

    Also Read: Kotam Reddy- Anam Ramanaraya Reddy: కోటంరెడ్డి, ఆనంల విషయంలో మారిన టీడీపీ స్ట్రాటజీ