Influenza: జ్వరం తగ్గడం లేదు.. దగ్గు వీడటం లేదు. దీనికి శ్వాసకోశ సమస్యలు అదనం కోలుకునేందుకు నెలలు పడుతోంది. ఫలితంగా మళ్లీ కోవిడ్ సోకిందా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతు న్నాయి. ఇది ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ప్రభావం వల్లే అని వైద్యులు అంటున్నారు. కొవిడ్ వైర్‌సతో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా.. దాదాపు అదే లక్షణాలతో మరోసారి ఇబ్బంది ఎదురవుతుండడంతో ప్రజలు నరకం చూస్తున్నారు
Also Read: Janhvi Kapoor: అతిపెద్ద సమస్యలో జాన్వీ కపూర్… హీరో రానా హెల్ప్!
‘హెచ్3ఎన్2’ వైరస్ కారణం
తాజా కేసులకు చాలావరకు ఇన్‌ఫ్లుయెంజా-ఏ ఉప రకం ‘హెచ్3ఎన్2’ వైరస్ కారణమని గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇతర ఉప రకాలతో పోలిస్తే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి. రెండు, మూడు నెలలుగా హెచ్3ఎన్2 దేశమంతటా విస్తృతంగా వ్యాప్తిలో ఉందని ఐసీఎంఆర్‌కు చెందిన నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంతో పాటు నిరంతరం దగ్గు రావడం, కొందరిలో శ్వాస కోశ సమస్యలు ముఖ్య లక్షణాలుగా పేర్కొంటున్నారు. కాగా, హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం/శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.
విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వద్దు
దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం వంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చెబుతోంది. రోగులకు ఉన్న లక్షణాల ఆధారంగా చికిత్సను సూచించాలని వైద్యులను కోరింది. ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల్లోపే తగ్గిపోతోంది. సీజనల్ జ్వరాలు మూడు రోజుల్లోనే తగ్గితే.. దగ్గు మాత్రం మూడు వారాల వరకూ కొనసాగుతుంది. కోవిడ్ తర్వాత వాతావరణంలో ఏ చిన్న మార్పు ఏర్పడినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటోంది.
Also Read:Aditi Rao Hydari: ఆ స్టార్ హీరోతో సహజీవనంలో అలా ఎంజాయ్ చేయడం నాకెంతో ఇష్టమన్న హీరోయిన్