https://oktelugu.com/

Aditi Rao Hydari: ఆ స్టార్ హీరోతో సహజీవనంలో అలా ఎంజాయ్ చేయడం నాకెంతో ఇష్టమన్న హీరోయిన్

Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ్ పై ఎఫైర్ రూమర్స్ కొత్తేమీ కాదు. పలువురు హీరోయిన్స్ తో ఈ బొమ్మరిల్లు హీరో ప్రేమాయణం నడిపాడన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన హీరోయిన్ అదితి రావు తో రిలేషన్ లో ఉన్నారనేది హాట్ టాపిక్. కొన్నాళ్లుగా ఈ జంట కలిసి కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సన్నిహితంగా ఉన్న ఫోటోలు పంచుకుంటున్నారు. ఇటీవల ఓ ట్రెండీ సాంగ్ కి కలిసి స్టెప్స్ వేసి వార్తల్లో నిలిచారు. వరుస పరిణామాల నేపథ్యంలో […]

Written By:
  • Shiva
  • , Updated On : March 6, 2023 / 10:18 AM IST
    Follow us on

    Aditi Rao Hydari

    Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ్ పై ఎఫైర్ రూమర్స్ కొత్తేమీ కాదు. పలువురు హీరోయిన్స్ తో ఈ బొమ్మరిల్లు హీరో ప్రేమాయణం నడిపాడన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన హీరోయిన్ అదితి రావు తో రిలేషన్ లో ఉన్నారనేది హాట్ టాపిక్. కొన్నాళ్లుగా ఈ జంట కలిసి కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సన్నిహితంగా ఉన్న ఫోటోలు పంచుకుంటున్నారు. ఇటీవల ఓ ట్రెండీ సాంగ్ కి కలిసి స్టెప్స్ వేసి వార్తల్లో నిలిచారు. వరుస పరిణామాల నేపథ్యంలో అదితిరావు-సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారనేది నిజమని పలువురు ధృవీకరిస్తున్నారు.

    Also Read: NTR On Oscar: అమెరికాకు పయనమైన ఎన్టీఆర్..!

    ఎట్టకేలకు హీరోయిన్ అదితి రావు హైదరి ఈ రూమర్స్ మీద స్పందించారు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… నేను పరిశ్రమకు వచ్చాక ఇలాంటి పుకార్లను పట్టించుకోవడం మానేశాను. జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళను మనం ఆపలేం. వాళ్లకు ఏది ఆసక్తిగా అనిపిస్తుందో దాని కోసం వెతుకుతూ ఉంటారు. నేను నా సంతోషం వెతుక్కుంటాను. నాకు సినిమా ఆఫర్స్ వస్తున్నంత వరకూ, ఇష్టమైన దర్శకులతో పని చేస్తున్నంత వరకు ఎవరు ఏమనుకున్నా నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను… అని వెల్లడించారు.

    అదితి పుకార్లను పట్టించుకోరని ఈ సందర్భంగా చెప్పారు. సిద్ధార్థ్ తో రిలేషన్ ను ఆమె పరోక్షంగా ఖండించారు. అయితే సమాధానం స్పష్టంగా లేదు. ఈ క్రమంలో కాలమే సమాధానం చెప్పాలని అభిమానులు భావిస్తున్నారు. అదితి రావు హైదరికి ఆల్రెడీ పెళ్ళై విడాకులయ్యాయి. తన వివాహాన్ని ఆమె గోప్యంగా ఉంచారు. మీడియా ఒకటి రెండు సందర్భాల్లో నిలదీస్తే… అది తెలియని ప్రాయంలో జరిగిన తంతు దాన్ని నేను పెళ్లిగా భావించడం లేదని సమాధానం చెప్పారు.

    Aditi Rao Hydari

    మరోవైపు సిద్దార్థ్ 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆమెతో 2007లో విడాకులయ్యాయి. అప్పటి నుండి అధికారికంగా ఆయన సింగిల్ రేలషన్షిప్ మైంటైన్ చేస్తున్నారు. అనధికారికంగా పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. సిద్ధార్థ్-అదితి రావు హైదరి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్ర సెట్స్ లోనే ప్రేమ బంధం ఏర్పడిందని సమాచారం.కాగా కెరీర్ పరంగా ఇద్దరూ స్ట్రగుల్ అవుతున్నారు. చెప్పాలంటే ఫేడ్ అవుట్ దశలో ఉన్నారు. సిద్ధార్థ్ భారతీయుడు 2లో కీలక రోల్ చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు.

    Also Read:Heroine Director Affair: టాలీవుడ్ లీక్స్: ఫేడవుట్ హీరోయిన్ తో పెళ్ళైన దర్శకుడి రాసలీలలు… ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్!