
Jagapathi Babu: నటుడు జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఎలాంటి పాత్రకైనా సెట్ అయ్యే పర్సనాలిటీ ఆయన సొంతం. హీరోగా స్ట్రగులవుతున్న రోజుల్లో దర్శకుడు బోయపాటి శ్రీను ఆయన్ని విలన్ చేశాడు. లెజెండ్ మూవీలో జగపతిబాబు ప్రతినాయకుడిగా పీక్స్ లో నటించారు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు వంటి సాఫ్ట్ రోల్స్ లో జగపతిబాబును చూసిన ప్రేక్షకులు కరుడుగట్టిన విలన్ రోల్ లో చూసి స్టన్ అయ్యారు. లెజెండ్ ఆయనకు ఊపిరి పోసింది. ఆర్థిక కష్టాల నుండి బయటపడే మార్గం వేసింది.
ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఉన్న జగపతిబాబు కెరీర్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఒక దశలో ఆయన చేతిలో చిల్లిగవ్వ లేదు చేయడానికి సినిమాలు లేవు. దానికి తోడు అప్పులు. ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగపతిబాబుకు ఈ పరిస్థితి రావడానికి వ్యసనాలే అన్న ప్రచారం జరిగింది. పలు సందర్భాల్లో జగపతిబాబు తనకు జూదం, ఆల్కహాల్ వంటి వ్యసనాలు ఉన్నాయన్నారు. పెద్ద పెద్ద కాసినోలకు పోయి జూదం ఆడేవాడట. హార్స్ రైడింగ్ బెట్టింగ్ కట్టేవాడట. ఈ వ్యసనాలు నన్ను దెబ్బతీశాయని ఆయన గతంలో చెప్పారు.
తాజా ఇంటర్వ్యూలో వందల కోట్ల రూపాయల ఆస్తులు పోవడానికి కారణాలు వెల్లడించారు. కేవలం జూదం వలన నేను ఆస్తులు పోగొట్టుకోలేదని చెప్పాడు. ఇప్పటివరకు నేను దాదాపు రూ. 1000 కోట్లు సంపాదించి ఉంటాను. ఆ డబ్బంతా ఎలా పోయిందంటే నా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. జూదంలో నేను సంపద పోగొట్టుకోలేదు. గ్యాంబ్లింగ్ నేను సరదా కోసమే ఆడతాను. నాకు డబ్బులు ఎలా దాచాలనే విషయంలో జీరో నాలెడ్జ్. సంపాదించిన డబ్బులు జాగ్రత్త చేయలేకపోయాను.

ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టడానికి లేదు. నా అజాగ్రత్త, అవగాహన లోపం కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు కూడా మోసం చేశారు. బ్రోకర్లను నమ్మి కొంత డబ్బు నాశనం చేశాను. మొత్తంగా నేను కోల్పోయిన ఆస్తులకు నేనే బాధ్యుడినని జగపతిబాబు చెప్పుకొచ్చారు. జగపతి బాబు పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపారనే వాదన ఉంది. ప్రియమణి విషయంలో ఆయన పేరు మారుమ్రోగింది. ఈ వీక్నెస్ తో కూడా జగపతిబాబు కోట్లు కోల్పోయాడని టాలీవుడ్ టాక్. జగపతిబాబు తండ్రి విబి రాజేంద్రప్రసాద్ ప్రముఖ నిర్మాత. ఆయన కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట.