Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ లా ధైర్యం చేయలేకపోతున్న జగన్, చంద్రబాబు

Pawan Kalyan: పవన్ లా ధైర్యం చేయలేకపోతున్న జగన్, చంద్రబాబు

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ప్రాపకం కోసం జగన్, చంద్రబాబు పాకులాడుతున్నారు. అయితే పవన్ మాత్రం బీజేపీతో ఉన్న స్నేహాన్ని అవసరమైతే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడున్న సిట్యువేషన్ లో బీజేపీని వదులుకోవడం అంటే వ్యతిరేకించడమే. అందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ సాహసోపేత నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బీజేపీని కాదన్న పార్టీలు, నేతల పరిస్థితి ఏమైందో తెలుసు కదా. ఉద్దవ్ ఠాక్రే ఉదంతమే అందుకు కారణం. తమతో కలిస్తే సరి.. లేకుంటే సీబీఐ, ఈడీ కేసులు అంటూ కేంద్రం ఎన్నిరకాలుగా ప్రయోగాలు చేస్తుందో చూస్తున్నాం. అదే సమయంలో తమకు సై అంటున్న పార్టీలకు, నేతలకు హైకమాండ్ పెద్దలు చక్కటి సహకరం అందిస్తున్న విషయాన్ని చూస్తున్నాం. అయితే ఇటువంటి సమయంలో అవసరమైతే కటీఫ్ అన్న సంకేతాలిచ్చిన పవన్ ధైర్యం జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. అయితే పవన్ కు ఉన్న క్లీన్ ఇమేజ్, అవినీతి ఆరోపణలు లేకపోవడమే ఆ ధైర్యానికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నారు.

తనకు బీజేపీ దూరమవుతుందన్నది జగన్ భయం. అదే జరిగితే కోర్టులు, కేసులు తప్పవన్న ఆందోళన ఆయనది. గత ఎన్నికల్లో చంద్రబాబుపై కోపంతో బీజేపీ హైకమాండ్ తనకు ఎంతగా సహకరించిందో జగన్ కు తెలియంది కాదు. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా తనకు అన్నవిధాలా ప్రోత్సాహం అందించిన విషయం గుర్తించుకున్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఆప్త మిత్రుడైనా.. అక్కడ ఆయన్ను బీజేపీ విపరీతంగా ధ్వేషిస్తున్నా.. ఇక్కడ మాత్రం తనతో ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తున్న విషయం తెలియంది కాదు. అయితే ఇప్పుడు బీజేపీ ఎదగకపోవడానికి వైసీపీతో ఉన్న రహస్య ఒప్పందమే కారణమని హైకమాండ్ పెద్దలు గుర్తించడంతో జగన్ లో ఆందోళన ప్రారంభమైంది. ఒక వైపు తనపై సీబీఐ కేసులు, మరోవైపు చిన్నాన్న వివేకా హత్య కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ… కేంద్రసాయం దూరమైతే గ్యారెంటీగా చిక్కుల్లో పడినట్టే.

Pawan Kalyan
Pawan Kalyan

అయితే తనకు సహకరించకపోయిన పర్వాలేదు.. కానీ చంద్రబాబును చేరదీస్తే మాత్రం తనకు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని జగన్ భయపడుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుపై ధ్వేషంతో వ్యవస్థలపరంగా అందిన సాయాన్ని జగన్ గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు అదే సాయం చంద్రబాబు వైపు టర్న్ అయితే తనకు భారీ నష్టం తప్పదని భావిస్తున్నారు. అందుకే తనకు చేయకపోయినా పర్వాలేదు. కానీ చంద్రబాబుకు ఎటువంటి సాయం చేయవద్దని తనకున్న ఢిల్లీ బలగంతో ఆయన చేయని ప్రయత్నం లేదు.

అయితే ఈ విషయంలో చంద్రబాబు స్ట్రాటజీ మరోలా ఉంది. మొన్నటివరకూ బీజేపీ కోసం వెయిట్ చేసిన ఆయన ఇప్పుడు అదే పార్టీకి డిఫెన్స్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటివరకూ బీజేపీని ఎలా దారిలో తెచ్చుకోవాలో తెలియక మల్లుగల్లాలు పడ్డారు. ఇప్పుడు పట్టభద్రుల స్థానాల్లో విజయం దక్కేసరికి బీజేపీని ఆత్మరక్షణలో పడేశారు. అయితే పవన్ మాదిరిగా బీజేపీని వ్యతిరేకించే సాహసం చేయడం లేదు. అదే జరిగితే జగన్ కు బీజేపీతో మరో అడ్వాంటేజ్ చేకూరుతుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే బీజేపీతో స్నేహాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే పవన్ మాత్రం జగన్, చంద్రబాబులకు విరుద్ధంగా స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతున్నారు. అవసరమైతే బీజేపీతో కటీఫ్ నకు కూడా సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపుతున్నారు. అయితే పవన్ లా ధైర్యం చేసే అవకాశం జగన్, చంద్రబాబులకు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular