Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు. సడన్ గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది . నాకైతే టెన్షన్ గా, సిగ్గుగా కూడా ఉందన్నారు. ఇక ఎంగేజ్మెంట్ కి కావలసిన బట్టలు, నగలు కొన్నారట. అవన్నీ వీడియోలో చూపించారు. అబ్బాయి ఎవరనేది వీడియో చివర్లో పరిచయం చేస్తానన్నారు. జబర్దస్త్ వర్ష ఇచ్చిన సర్ప్రైజ్ కి నెటిజన్లు మైండ్ బ్లాక్ అయ్యింది. అనూహ్యంగా ఈ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం ఏమిటో తెలియాలంటే… మేటర్ లోకి వెళ్ళాలి. వర్ష జబర్దస్త్ లేడీ కమెడియన్ గా పాపులారిటీ తెచ్చు కున్నారు. సీరియల్స్ లో నటించిన వర్షకు ఆశించిన స్థాయిలో ఫేమ్ రాలేదు. దీంతో జబర్దస్త్ బాట పట్టారు.

ఈ నిర్ణయం ఆమెకు మేలు చేసింది. బుల్లితెర స్టార్ గా ఎదిగేందుకు దోహదం చేసింది. జబర్దస్త్ ఫేమస్ కమెడియన్స్ లో ఒకరిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కాగా కమెడియన్ ఇమ్మానియేల్ తో ఆమె లవ్ ట్రాక్ నడుపుతున్నారు. ఇమ్మానియేల్-వర్ష తమని తాము బుల్లితెర లవ్ బర్డ్స్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా వర్ష ఇమ్మానియేల్ పై ఎక్కడలేని ప్రేమాభిమానాలు చూపిస్తుంది. నువ్వు ఊ అంటే పెళ్ళికి సై అన్నట్లు మాట్లాడుతుంది. ఇమ్మానియేల్ తనకు దక్కిన అదృష్టం, ఏది ఏమైనా అతన్ని వదులుకునేది లేదంటుంది.
ఈ క్రమంలో జబర్దస్త్ వర్ష ఎంగేజ్మెంట్ ఎవరితో జరిగిందనే చర్చ మొదలైంది. అయితే వర్ష ఫ్రాంక్ చేసింది. ఎంగేజ్మెంట్ జరుగుతున్న మాట వాస్తవమే కానీ అది వర్షకు కాదు. రాకింగ్ రాకేష్ ఎంగేజ్మెంట్ అట. తన ఎంగేజ్మెంట్ మేటర్ రాత్రికి రాత్రే రాకేష్ చెప్పాడట. సదరు ఫంక్షన్ కి సిద్ధం కావడానికి వర్ష హడావుడి పడిందట. ఆ క్రమంలో రాకింగ్ రాకేష్ పై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. అలాగే త్వరలో తాను కూడా శుభవార్త చెబుతాను, అన్నారు. వర్ష తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన ఈ ఫ్రాంక్ వైరల్ అవుతుంది.

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతలకు ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు హాజరయ్యారు. మంత్రి రోజా, అనసూయ, గెటప్ శ్రీను ఇలా బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. కొన్నాళ్లుగా రాకింగ్ రాకేష్ సుజాతను ప్రేమిస్తున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. త్వరలో వివాహం జరగనుంది. ప్రస్తుతం సుజాత రాకింగ్ రాకేష్ తోనే ఉంటున్నారు. జబర్దస్త్ వేదికగా చిగురించిన వీరి ప్రేమ పెళ్ళికి దారితీసింది.