
Hansika: పుట్టిన ప్రతి మనిషి ప్రేమలో పడతాడు. అందరి జీవితంలో కొన్ని ప్రేమ కథలు ఉంటాయి. సాధారణ జనాల లవ్ ఎఫైర్స్ వెలుగులోకి రావు. సెలబ్రిటీల వ్యవహారాలైతే జనాలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. హీరోల్లో కొందరు మన్మథరాజాలు ఉన్నారు. అధికారికంగానే వీరు నలుగురైదుగురు అమ్మాయిలతో ఎఫైర్స్ నడిపారు. నార్త్ లో రన్బీర్ కపూర్ బాగా ఫేమస్. సౌత్లో శింబు, సిద్దార్థ్ వంటి హీరోల పేర్లు చెప్పొచ్చు. హీరో శింబు నయనతారతో మొదలుపెట్టి హన్సికతో సయ్యాటలాడి త్రిషా వరకు వచ్చాడు. ఈ ముగ్గురితో ఏళ్ల తరబడి ఎఫైర్ నడిపారు.
శింబు-హన్సిక పబ్లిక్ గానే తమ ప్రేమను చాటుకున్నారు. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అనూహ్యంగా కొన్నేళ్ల క్రిందట బ్రేకప్ అయ్యారు. ఇటీవల హన్సిక పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి మిత్రుడు వ్యాపారవేత్త అయిన సోహైల్ కతూరియాను వివాహమాడారు. 4 డిసెంబర్ 2022లో జైపూర్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. హన్సిక వివాహానికి బంధు మిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు.
పెళ్ళై మూడు నెలలు అవుతుండగా మొదటిసారి హన్సిక బ్రేకప్ పై నోరు విప్పారు. తన మాజీ లవర్ తో అనుభవాలు షేర్ చేసుకున్నారు. పేరు ప్రస్తావించకున్నప్పటికీ… ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒకసారి బ్రేకప్ అయ్యాక మరొకరిని అంగీకరించడానికి నాకు ఎనిమిదేళ్ల సమయం పట్టింది. నేను ప్రేమను బలంగా నమ్ముతాను. అయితే మరీ రొమాంటిక్ పర్సన్ అయితే కాదు. అన్ని భావోద్వేగాలు సులభంగా చూపించలేను. నాకు జీవితాంతం తోడుంటే వ్యక్తి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు చాలా ఆలోచించాను. ఎందుకంటే గత రిలేషన్షిప్ విచిత్రంగా సాగింది. ఏది ఏమైనా అది ముగిసిన కథ.. అని అన్నారు.

హన్సిక భర్త సోహైల్ కి ఇది రెండో వివాహం. ఇద్దరికీ చిన్నప్పటి నుండి పరిచయం ఉన్నట్లు సమాచారం. గత స్మృతులు పూర్తిగా చెరిపివేసి మిత్రుడితో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక పలు చిత్రాల్లో నటించారు. ఆమెను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా ఆయన తెరకెక్కించిన దేశముదురు సినిమాలో హన్సిక నటించారు. వరుసగా తెలుగులో అనేక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టారు. కొన్నాళ్లుగా ఆమె కోలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అరడజను సినిమాలు చేస్తున్నారు.