IT Layoffs: ఐటీ లో లే_ఆఫ్ ల పరంపర కొనసాగుతున్నది. 2008 మహా మాంద్యానికి మించి విపత్తు కొనసాగుతున్నది. చిన్నా పెద్దా కంపెనీ అని తేడా లేకుండా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా టాప్ లిస్ట్ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండడంతో భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో తెలియదు. తెల్లారి ఆఫీస్ కు వెళితే ఎవరికి పింక్ స్లిప్ వస్తుందో తెలియదు. మొత్తానికి ఐటీ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారింద

వీరి మెడ పై కత్తి
ఐటి పరిశ్రమ కాక వికలం అవుతున్న నేపథ్యంలో కంపెనీలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి.. అందులో భాగంగానే అడ్డగోలుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.. అయితే అందరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు మైక్రోసాఫ్ట్ మానవనుల విభాగం మాజీ ఉపాధ్యక్షుడు క్రిస్ విలియమ్స్ .. ఐటీలో లే_ ఆఫ్ కత్తి కేవలం మూడు విభాగాల ఉద్యోగుల పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.. కాంట్రాక్ట్ వర్కర్లు, కొత్త ప్రాజెక్టులతో అనుసంధానమైన వారు, ఈవెంట్ ప్లానింగ్ లో ఉన్న ఉద్యోగుల కు ఇక కష్ట కాలమే అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం లే_ ఆఫ్ కు గురయిన వారిలో ఈ మూడు విభాగాల ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమెరికా, యూరో జోన్ లో ఈ విభాగాలకు చెందిన ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంది.
నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి
ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.. ఎవరి కొలువు ఎప్పుడు ఊడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొలువు ఊడకూడదంటే ఉద్యోగులు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో కృత్రిమ మేధ, ఆగ్ మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాల్టీ వంటి వాటిపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.. ప్రస్తుతం వీటికి మార్కెట్ ఎక్కువగా ఉంది. మరో దశాబ్దం వరకు వీటి ఆధారంగానే కంపెనీలకు ప్రాజెక్టులు రానున్నాయి.. పెద్ద పెద్ద కంపెనీలు వీటి మీదే వేలకోట్ల పెట్టుబడులు పెట్టాయి. అలాగని వీటినే భవిష్యత్తు అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.. కొంతకాలం అయిన తర్వాత వీటికి కూడా డిమాండ్ తగ్గుతుందని, అప్పుడు కొత్త వాటిలో నైపుణ్యం పెంచుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఐటీ ఉద్యోగి నిత్యం అప్ డేట్ అవుతూ ఉండాలని చెబుతున్నారు.