Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ గా నిలిచి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రం గా నిలిచింది..బాలయ్య గత చిత్రం ‘అఖండ’ గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై సుమారుగా 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..వరుస ఫ్లాప్స్ తో కెరీర్ ముగిసే స్థాయి లో ఉన్న బాలయ్య కి మరోసారి ఊపిరి పోసింది ఆ చిత్రం.

ఆ సినిమా ఏ ముహూర్తం లో వచ్చిందో ఏమో తెలీదు కానీ,బాలయ్య తలరాతనే మార్చేసింది..కనీసం 30 కోట్ల రూపాయిల మార్కెట్ కూడా లేని బాలయ్య కి ఈ సినిమా తర్వాత నుండి 75 కోట్ల రూపాయలకు ఎగబాకేలా చేసింది..వీర సింహా రెడ్డి కి డివైడ్ టాక్ వచ్చినా కూడా 70 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి..ఇది మామూలు విషయం కాదు.
అందుకే ఈ సినిమా సక్సెస్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది మూవీ టీం..నిన్న హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది..ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు టాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకులు మరియు యువ హీరోలు కూడా హాజరయ్యారు..కనులపండుగగా సాగిన ఈ ఈవెంట్ లో బాలయ్య బాబు రెట్టింపు ఉత్సాహం తో తనలోని సింగర్ కి పని చెప్పాడు.

ఆయన హీరో గా నటించిన పాత సినిమా ‘మాతో పెట్టుకోకు’ చిత్రంలోని ‘మాఘమాసం లగ్గం పెట్టిస్తా’ అనే పాటని సింగర్స్ తో కలిసి పాడాడు..అది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడవచ్చు..బాలయ్య ఇలా పబ్లిక్ వేదిక మీద పాటలు పాడడం ఇది రెండవసారి..గతం లో ఆయన ‘మేము సైతం’ ఈవెంట్ లో ‘లెజెండ్’ సినిమాలోని పాటని పాడాడు..అది ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది.