
Venkatesh Saindhav Movie Story: ఈమధ్య కాలం లో నేటి తరం స్టార్ హీరోల కంటే సీనియర్ హీరోలే ఎక్కువ సినిమాలు చేస్తూ, భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు.చిరంజీవి , బాలకృష్ణ వంటి హీరోలు రీసెంట్ టైం లో ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారో మన అందరం చూసాము.వాళ్ళతో పోలిస్తే విక్టరీ వెంకటేష్ బాగా వెనుకబడ్డాడు అని అనిపిస్తుంది.గత కొన్నేళ్ల నుండి కేవలం మల్టీస్టార్ర్ర్ సినిమాలే చేస్తూ వచ్చిన వెంకటేష్ , సోలో హీరో గా ఒక సినిమా చేసి చాలా కాలమే అయ్యింది.
రీసెంట్ టైం లో సోలో గా చేసిన నారప్ప మరియు దృశ్యం 2 సినిమాలు నేరుగా ఓటీటీ లో విడుదలయ్యాయి.వీటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా వెంకటేష్ ఫ్యాన్స్ లో సంతోషం లేదు.ఎందుకంటే వాళ్ళు ఆ రెండు సినిమాలను థియేటర్స్ లో చూడాలని ఆశపడ్డారు.అయితే ఎట్టకేలకు వెంకటేష్ ‘సైంధవ్’ అనే క్రేజీ ప్రాజెక్ట్ తో మన ముందుకి రాబోతున్నాడు.
హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకుడు.రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కానీ ఈ సినిమాకి అప్పుడే గ్లిమ్స్ వీడియో కూడా విడుదల చేసారు.ఈ వీడియో చూస్తే ఈ చిత్రం కమల్ హాసన్ నటించిన విక్రమ్ తరహాలో యాక్షన్ థ్రిల్లర్ అనేది అర్థం అవుతుంది.కానీ రీసెంట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ‘సైంధవ్’ కూడా హిట్ సిరీస్ తరహాలోనే ఇన్వెస్టిగేటివ్ థీమ్ తో కొనసాగుతుందట.ఇందులో విక్టరీ వెంకటేష్ పోలీస్ గా నటిస్తున్నాడు.

హిట్ సినిమాని ఎలా అయితే ఫ్రాంచైజ్ గా తెరకెక్కిస్తున్నాడో, సైంధవ్ ని కూడా అలాగే ఫ్రాంచైజ్ లాగ తెరకెక్కించాలని శైలేష్ ఆలోచిస్తున్నాడట.ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.మంచి క్రియేటివ్ టాలెంట్ ఉన్న శైలేష్, వెంకటేష్ కి మరపురాని బ్లాక్ బస్టర్ హిట్ ని ఇస్తాడో లేదో చూడాలి.త్వరలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు మూవీ టీం అధికారికంగా ప్రకటించబోతుంది.