Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం ఇదేనా ?

Pawan Kalyan: ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం ఇదేనా ?

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు ? గాజువాకా ? భీమ‌వ‌ర‌మా ?. ఈ రెండూ కాకుండా కొత్త నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారా ? అన్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మవుతోంది. టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఖాయ‌మవుతుంద‌న్న నేప‌థ్యంలో ప‌వ‌న్ పోటీ పై చ‌ర్చ మొద‌లైంది. జ‌న‌సేనాని వ్యూహం ఎలా ఉండ‌బోతుందోనన్న ఆస‌క్తి నెల‌కొంది.

Pawan Kalyan
Pawan Kalyan

గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేశారు. ఒంట‌రిగా పోటీ చేయ‌డంతో గెలుపు అవ‌కాశాలు దెబ్బ‌తిన్నాయి. దీంతో 2024 ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే ప్రశ్న మొద‌లైంది. తిరుప‌తి, పిఠాపురం, కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు జ‌న‌సేన ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు వినిపిస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఇప్పుడే జ‌న‌సేన ప్ర‌క‌టించే అవ‌కాశం లేదు. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిశీల‌న వెనుక జ‌న‌సేన వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ క‌నిపిస్తోంది.

తిరుప‌తి నుంచి ప్ర‌జారాజ్యం వ్య‌వ‌స్థాప‌కుడు మెగాస్టార్ చిరంజీవి గెలిచారు. తిరుప‌తిలో కాపు సామాజిక వ‌ర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో జ‌న‌సేన తిరుప‌తి స్థానాన్ని ప‌రిశీలిస్తోంది. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా జ‌న‌సేన ప‌రిగ‌ణిస్తోంది. పిఠాపురంలో 75 శాతం కాపు ఓట‌ర్లు ఉన్నారు. ప‌వ‌న్ పోటీ చేస్తే విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క అవుతుంద‌ని జ‌న‌సేన నేత‌లు భావిస్తున్నారు. పిఠాపురం జ‌న‌సేన నేత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ ప‌ట్ల ఉత్సాహంగా ఉన్నార‌ని తెలుస్తోంది.

Pawan Kalyan
Pawan Kalyan

కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌జారాజ్యం నుంచి మొద‌టిసారిగా కుర‌సాల క‌న్న‌బాబు గెలిచారు. ఆ త‌ర్వాత వైసీపీలో చేరి గెలిచారు. కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు ల‌క్షా ఎన‌భై వేల ఓట్లు ఉంటే.. అందులో ల‌క్ష ఓట్లు కాపులవే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ పోటీ చేస్తే పార్టీల‌క‌తీతంగా కాపులు జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

గాజువాక‌, భీమ‌వ‌రం నుంచి పోటీ చేయ‌ని ప‌క్షంలో.. కాకినాడ రూర‌ల్, పిఠాపురం, తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గాల‌ను జ‌న‌సేనాని ఎంచుకునే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. భీమవ‌రంలో జ‌న‌సేనాని పోటీ చేస్తే గెలుపు త‌థ్య‌మ‌ని వైసీపీ త‌ర‌పున స‌ర్వే నిర్వ‌హించిన ఐపాక్ సంస్థ స‌ర్వేలో కూడ తేలింది. భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప‌ట్ల అక్క‌డ ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నార‌ని ఐపాక్ స‌ర్వేలో స్ప‌ష్ట‌మ‌యింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేనాని ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌న్న అంశం పై సందిగ్ధ‌త నెల‌కొంది.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version