
Balakrishna: గుండెపోటు వచ్చి హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తారకరత్న సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి , తన తుది శ్వాసని ఇటీవలే విడిచిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.నిన్ననే మహాప్రస్థానం లో తారకరత్న అంత్యక్రియలు బందు మిత్రుల సమక్ష్యం లో జరిగింది.ముందుగా తారకరత్న పార్థివ దేహాన్ని ఆయన స్వగృహానికి తరలించారు.
అక్కడ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులు మరియు రాజకీయ నాయకులందరూ తారకరత్న పార్థివ దేహాన్ని సందర్శించిన తర్వాత అభిమానులు కోసం పక్క రోజు ఫిలిం ఛాంబర్ కి తరలించారు.అక్కడ అశేష అభిమానఘనం తారకరత్న ని చివరి చూపు చూసేందుకు పోతెత్తారు.అయితే అక్కడకి అఘోర గెటప్ లోకి వచ్చిన ఒక మతి స్థిమితం లేని వ్యక్తి బాలయ్య వద్ద కి వచ్చి చేసిన కొన్ని కామెంట్స్ నందమూరి అభిమానులను కలవరపెడుతుంది.
ప్రత్యేకంగా అతను బాలయ్య బాబు కి ‘జాగ్రత్తగా ఉండూ’ అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.అతను అలా ప్రత్యేకించి బాలయ్య కి మాత్రమే ఎందుకు అలా చెప్పాడు, ఆయనకీ ఎమన్నా జరగబోతుందా?, దేవుడు ముందుగానే ఆ మతి స్థిమితం లేని వ్యక్తి దగ్గర నుండి బాలయ్య కి జాగ్రత్తగా ఉండూ అంటూ హెచ్చరికలు జారీ చేశాడా? అని నందమూరి అభిమానుల్లో భయాందోళనలు జరిగింది.నిన్న అతగాడు బాలయ్య ని సమీపించి అలా మాట్లాడేసరికి కాస్త ఆ ప్రాంతం మొత్తం గందరగోళం గా మారింది.

వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు బయటకి లాక్కెళ్లారు.అతనొక మతి స్థిమితం లేని వ్యక్తి అని, ఫిలిం నగర్లో ఇలాగే పిచ్చోడి లెక్క తిరుగుతూ ఉంటాడని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.అయితే ఇలాంటి మాటలను సీరియస్ గా తీసుకునే బాలయ్య,, అతను చెప్పిన మాటలను దేవుడు పంపిన సందేశం గా భావించి జాగ్రత్త వహిస్తాడా లేదా అనేది చూడాలి.
