Atlantic Ocean: ఈ భూమి మీద మహాసముద్రాల పుట్టుక గురించి ఇంతవరకు ఏ అధ్యయనం కూడా స్పష్టమైన ఆధారాన్ని చూపించలేదు. అయితే కాలానుక్రమంలో ప్రకృతిలో సంభవించిన మార్పుల వల్ల కొత్త సముద్రాలు ఏర్పడ్డాయి. పాత సముద్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి.. ప్రస్తుతం భూమ్మీద ఏడు మహా సముద్రాలు ఉన్నాయి. అందులో ఒకటి అట్లాంటిక్ మహాసముద్రం ఒకటి. ఈ సముద్రం త్వరలో విలుప్తమవుతుందని లిస్బన్ విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
అట్లాంటిక్ సముద్రం జీబ్రాల్డర్ జల సంధి స్పెయిన్ (ఉత్తరం), మొరాకో (దక్షిణం) దేశాల మధ్య సరిహద్దుగా ఉంటుంది. ఈ రెండు దేశాలతో పాటు యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. ఈ మహాసముద్రం 10_ మైలు జల సంధి వద్ద రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లు, యురేషియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్ ఢీకొనే చోట ఉంది. లిస్బన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల పరిశీలనలో కొత్త విషయం వెలుగు చూసింది. జీబ్రాల్టర్ జలసంధికి దిగువన ఉన్న సబ్ డక్షన్ జోన్ అట్లాంటిక్ లోపల మరింత వ్యాప్తి చెందుతుందని, అట్లాంటిక్ సబ్ డక్షన్ సిస్టమ్ ను రూపొందించడానికి దోహదం చేస్తుందని లిస్బన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. అట్లాంటిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా ఇది రూపాంతరం చెందుతుందని.. కాకపోతే దీనికి 20 మిలియన్ సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వారు అంటున్నారు.
భౌగోళిక శాస్త్రవేత్తలు తమ అంచనా ప్రకారం మహాసముద్రాలు శాశ్వతం అని చెబుతుంటారు. కానీ కాల క్రమంలో అవి రకరకాల మార్పులకు గురవుతూ ఉంటాయి. కాకపోతే వీటికి కొన్ని వందల మిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది. దీనిని భౌగోళిక పరిభాషలో విల్సన్ సైకిల్ అంటారు. ఉదాహరణకు అట్లాంటిక్ మహాసముద్రం 180 మిలియన్ సంవత్సరాల క్రితం పాంగేయా అనే సముద్రం విడిపోయినప్పుడు పుట్టింది. మధ్యధరా సముద్రం కూడా ఒకప్పుడు ఆఫ్రికా యురేషియా మధ్య ఉన్న టెథిస్ అనే సముద్రం నుంచి పుట్టింది. కొత్త సబ్ డక్షన్ జోన్ లు, టెక్టోనిక్ ప్లేట్ ఢీకొట్టుకోవడం వల్ల ఏర్పడే మునిగిపోయే ప్రదేశాలు అట్లాంటిక్ మహాసముద్రం కాలగర్భంలో కలిసి పోవడానికి కారణమవుతాయి. కొత్త సబ్ డక్షన్ జోన్ లు ఏర్పడటానికి
టెక్టోనిక్ ప్లేట్ లు చాలా అవసరం.. కొత్త సబ్ డక్షన్ జోన్ లు కాలగర్భంలో కలిసిపోయిన సముద్రాల నుంచి ఇతర సహజమైన మహాసముద్రాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.. కాకపోతే దీనికి మిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది. సబ్ డక్షన్ జోన్ లు మహా సముద్రాల్లోకి వెళ్లడాన్ని సబ్ డక్షన్ జోన్ దండయాత్ర అని పిలుస్తుంటారు.
సబ్ డక్షన్ జోన్ దండయాత్ర 3D మోడల్ ద్వారా గుర్తించారు. జీబ్రాల్టర్ జలసంధికి దిగువన ఉన్న సబ్ డక్షన్ జోన్ అట్లాంటిక్ లోపల మరింత వ్యాప్తి చెందుతుందని.. అట్లాంటిక్ సబ్ డిక్షన్ విధానాన్ని రూపొందించేందుకు దోహదం చేస్తుందని లిస్బన్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అంతేకాదు మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడే అట్లాంటిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇప్పటికే పసిఫిక్ సముద్రంలో ఉన్న నిర్మాణానికి సారూప్యంగా ఉంటుందని లిస్బన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. అలాంటప్పుడు పసిఫిక్ మహాసముద్రం కూడా కాలగర్భంలో కలిసి పోతుందా? పరిశోధకుల పరిశీలన అదే విషయాన్ని తేట తెల్లం చేస్తోంది.