Homeఆంధ్రప్రదేశ్‌TDP: ఖుషి ఖుషీగా బిజెపిలోని ప్రో టిడిపి నేతలు

TDP: ఖుషి ఖుషీగా బిజెపిలోని ప్రో టిడిపి నేతలు

TDP: తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి ఎంట్రీ దాదాపు ఖరారు అయ్యింది. వచ్చేవారం ఎన్డీఏలోకి టిడిపి చేరుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు ఇవి జరగనున్నాయి. మరోవైపు చంద్రబాబు ఇంట్లో రాజశ్యామల యాగం ప్రారంభమైంది. రేపటి వరకు జరగనుంది. అటు తరువాత చంద్రబాబు ఢిల్లీ పయనమవుతారని తెలుస్తోంది. పవన్ సైతం హస్తినబాట పడతారని సమాచారం. ఈ నేపథ్యంలో టిడిపి ఎన్డీఏలోకి ఎంట్రీ లాంఛనమేనని తెలుస్తోంది. దీంతో బిజెపిలోని ప్రో టిడిపి నేతలు ఎవరికి వారుగా పావులు కదుపుతున్నారు.

గత ఎన్నికల్లో టిడిపి ఓటమి తరువాత నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్లారు. చంద్రబాబు దగ్గరుండి వారిని బిజెపిలోకి పంపించారని ప్రచారం జరిగింది. ఇందులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సీఎం రమేష్, సుజనా చౌదరి ఉన్నారు. బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు వ్యవహారం వెనుక ప్రధానంగా ఉన్నది వీరిద్దరేనని తెలుస్తోంది.రెండు పార్టీల మధ్య చర్చలు, సీట్ల సర్దుబాటు విషయంలో సైతం వీరే కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు కుదరకపోతే బయటకు వచ్చేది కూడా ఈ ఇద్దరే. అయితే ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ ఖాయం కావడంతో ఈ ఇద్దరు ఎంపీలుగా పోటీ చేసేందుకు పావులు కదపడం ప్రారంభించారు.

2014 ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు టిడిపిలో కీలకంగా వ్యవహరించారు. స్వతహాగా పారిశ్రామికవేత్తలు అయిన ఈ ఇద్దరు టిడిపికి ఆర్థిక వనరులను సమకూర్చారు. రాష్ట్రస్థాయిలో సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో టిడిపి గెలుపు పొందడంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా మారారు. క్యాబినెట్ మంత్రులకు మించి హోదా వెలగబెట్టారు. కొద్ది రోజులకే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే గత ఎన్నికల్లో బిజెపిని విభేదించిన టిడిపి.. ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఈ ఇద్దరు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకు బిజెపిలో చేరారు అన్నది ఒక ప్రచారం. అందుకు తగ్గట్టుగానే గత నాలుగున్నర సంవత్సరాలుగా వారి వ్యవహార శైలి ఉంది. ఇప్పుడు బిజెపితో టిడిపి చేతులు కలపనుండడంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

పొత్తులో భాగంగా ఎక్కువ పార్లమెంట్ స్థానాలను బిజెపి కోరుకుంటుంది. అదే జరిగితే బిజెపి ఆశావహులుగా సీఎం రమేష్, సుజనా చౌదరి ఉండడం ఖాయం. వీరిద్దరి విషయంలో చంద్రబాబు సైతం ఎటువంటి అడ్డు చెప్పరు. వారు బిజెపిలో ఉన్న టిడిపి ప్రయోజనాలే కోరుకుంటారని చంద్రబాబు కు తెలుసు. అందుకే వారిద్దరు సైతం తమకు శ్రేయస్కరమైన లోక్ సభ స్థానాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. పొత్తులో భాగంగా వారి ఆశించిన సీట్లు బిజెపికి ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఈ నేపథ్యంలో సీఎం రమేష్ విజయవాడ కానీ, గుంటూరు నుంచి కానీ పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు సీఎం రమేష్ సైతం ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు. మొత్తానికైతే బీజేపీలోని బ్రో టిడిపి నేతల్లో మాత్రం పొత్తుల సందడి నెలకొంది. తమకు పదవులు తప్పకుండా వస్తాయని వారు ఆనందంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular