Rana- Shriya Saran: సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇప్పటికీ బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్న నటి శ్రీయ శరన్.’ఇష్టం’ అనే సినిమాతో ప్రారంభమైన ఆమె కెరీర్, మొన్న విడుదలైన #RRR వరకు కొనసాగింది. సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి పని చేసిన శ్రీయ , పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగడం విశేషం. అయితే ఈమె పెళ్ళికి ముందు ఒక క్రేజీ హీరో తో దాదాపుగా 5 ఏళ్ళు డేటింగ్ చేసిందట.
ఆ హీరో మరెవరో కాదు, దగ్గుపాటి రానా. మనోడికి అప్పట్లో ఉండే అఫైర్స్ చాలా ఎక్కువే, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా శ్రీయ తో ఇతగాడి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి ఆగిందట. వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు, కానీ ప్రైవేట్ పార్టీలకు తరుచు మీట్ అవుతూ ఉంటారు.అలా పరిచయమైనా ఈ జంట మధ్య అప్పట్లో ప్రేమలో చిగురించింది.
ముంబై లో ఒకే ఇంట్లో 5 ఏళ్ళ పాటు లివింగ్ రిలేషన్ షిప్ ని కొనసాగించారు. అయితే ఒకే చోట కలిసి ఉన్నప్పుడు గొడవలు రావడం అనేది సర్వసాధారణం, అలా వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయం భేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చిందట.ఆ తర్వాత కొన్నాళ్ళకు శ్రీయ ఆండ్రెయి కొత్సవ్ ని పెళ్లాడింది. ఈ దంపతులిద్దరికీ ఒక పాప కూడా ఉంది.అలాగే రానా కూడా కొన్నాళ్ళకు మిహిక బజాజ్ అనే అమ్మాయిని పెళ్లాడాడు.అలా ఈ ఇద్దరి జీవితాలు వేరు వేరు అయ్యాయి.
ఇక శ్రీయ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది ప్రారంభం లోనే కబ్జా అనే కన్నడ సినిమా ద్వారా మన ముందుకు వచ్చిన ఈమె, ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్ అనే చిత్రం లో నటిస్తుంది. తెలుగు , హిందీ మరియు తమిళం లో ఏకకాలం లో షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుంది.