Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. మొఘల్ సామ్రాజ్యం లో జరిగే ఈ పీరియాడిక్ డ్రామా గత రెండేళ్ల నుండి షూటింగ్ కొనసాగుతూనే ఉంది. మధ్యలో కరోనా రావడం, లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం తో పాటుగా, వేరే సినిమాలకు షిఫ్ట్ అవ్వడం వల్ల షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చింది.
అయితే ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ ని తిరిగి ప్రారంభించుకున్న ఈ చిత్రం, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు తియ్యాల్సిన పార్ట్ ఒక్కటే మిగిలి ఉందని, ఇందుకోసం పవన్ కళ్యాణ్ 30 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొస్తున్నారు మేకర్స్, అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఇవ్వాల్సిన ఆ 30 రోజుల డేట్స్ ఇవ్వకుండా వేరే చిత్రాలపై ఫోకస్ పెట్టడం తో నిర్మాత AM రత్నం తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తునట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
ఇప్పటికే ఫైనాన్సియర్స్ దగ్గర నుండి రెండు వందల కోట్ల రూపాయిలు అప్పు తీసుకున్నాను అని, వాటికి వడ్డీ ఇప్పుడు కొండంత అయ్యిందని, కేవలం 30 రోజులు కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుంది కానీ, నా సినిమాకి కాకుండా అందరికీ ఆయన డేట్స్ ఇస్తున్నదంటూ AM రత్నం తనలో ఉన్న బాధని తన సన్నిహితుల మధ్య బయటపెట్టినట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ అలా చెయ్యడానికి కారణం కూడా లేకపోలేదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒప్పుకున్న కొత్త సినిమాలకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ తో పోలిస్తే ‘హరి హర వీరమల్లు’ కి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ చాలా తక్కువ అట. అందుకే భారీ పారితోషికాలు ఇస్తున్న వారికి ముందుగా డేట్స్ ఇస్తూ ‘హరి హర వీరమల్లు’ ని ఆలస్యం చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం మే నెలలో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ పెట్టలేక్కబోతున్నట్టు తెలుస్తుంది.