Extramarital Affairs: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. దాంపత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని ఎదుర్కొని సంసారం చేయాల్సిన అవసరం ఉంటుంది. పొద్దున్నే గొడవ పడినా సాయంత్రం మళ్లీ ఒక్కటయ్యేది దంపతులే. దీంతోనే సాగరమైనా ఈదొచ్చు కానీ సంసారం ఈదలేం అని చెబుతుంటారు. సంసారంలో కలతలు రావడం మామూలే. వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి. చీటికి మాటికి గొడవలు పడితే నలుగురిలో చులకన కావడం సహజమే.

అందుకే తగాదాలు పెట్టుకోవడం అంత మంచిది కాదని ఇద్దరు గుర్తుంచుకుంటే సరిపోతుంది.పెళ్లయిన ఏడేళ్లకు భార్య మీద పోతుందని అంటుంటారు. తరువాత మెల్లగా ఇంకో మహిళతో చనువుగా ఉండాలని మగాళ్లు భావిస్తారట. కట్టుకున్న భార్య ఇంట్లో ఉండగానే పరాయి స్త్రీ కోసం తపిస్తుంటాడట. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాలు నెలకొంటున్నాయి. ఇటీవల కాలంలో హత్యలకు ప్రధాన కారణం అక్రమ లైంగిక సంబంధాలే కనిపిస్తున్నాయి. భార్య అయినా భర్త అయినా పరాయి వారి మీద మనసు పడితే అంతేసంగతి. వారికే ఆకర్షణగా మారి కట్టుకున్న వారికి తలవంపులే తెస్తున్నారు.
ఇంట్లో తరచూ గొడవలు జరిగితే కూడా మనసు ప్రశాంతత దెబ్బ తింటుంది. దీంతో మరో మహిళతో సుఖంగా ఉండాలనే ఆలోచనకు వస్తున్నారు. దీంతోనే అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి. కట్టుకున్న భార్య భర్తను బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పురుషులు తమ భార్య దగ్గర సరైన సుఖం అందడం లేదనే వాదనలతో ఇంకో స్త్రీ కోసం తాపత్రయపడుతుంటాడు. పెద్ద కారణాలు లేకపోయినా చిన్న కారణాలతోనే భార్యను పక్కన పెడుతూ అక్రమ సంబంధం కోసం వెతుకున్నారని చెబుతున్నారు.

పురుషులు భార్య ఉండగానే మరో మహిళతో కలిసి ఉండటానికి ఇష్టపడుతుంటారు. భార్యలకు చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో చెప్పుకోవాలని చూస్తారు. స్నేహితులు లేని పక్షంలో ఇతర మహిళలను తమ స్నేహితులుగా భావించి వారితో చనువుగా ఉంటారు. అదే వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. అందుకే భార్యలు భర్తలను మంచి మాటలతో తమ వైపుకు తిప్పుకుని పక్కదారి తొక్కేందుకు ఆస్కారం ఇవ్వకూడదు. తమ వారిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా జీవితభాగస్వామి మరో దారిలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.