
Rajamouli Hero: తెలుగు సినిమా అంటే ఇప్పుడు మన అందరికి గుర్తుకు వచ్చే పేరు దర్శక ధీరుడు రాజమౌళి ..మగధీర,ఈగ , బాహుబలి సిరీస్ మరియు #RRR వంటి చిత్రాలతో మన తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ కి తీసుకెళ్లి, ఆస్కార్ అవార్డ్స్ తో పాటుగా ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ ని దక్కించేలా చేసిన మొడ్డమొదటి ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
జేమ్స్ కెమరూన్, స్పీల్ బర్గ్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు కూడా రాజమౌళి ప్రతిభ కి సలాం కొట్టారంటే ఇంతకు మించి ఏమి కావాలి, ఆయన పేరే తెలుగు సినిమాకి పర్యాయపదం లాగ మారిపోయింది అని చెప్పడానికి.ఒకవేళ రాజమౌళి డైరెక్టర్ గా కాకుండా హీరో గా వెళ్లి ఉంటే మన తెలుగు సినిమాకి ఇంతటి ఘన కీర్తి దక్కేదా..?,కచ్చితంగా దక్కి ఉండేది కాదు,ఆయన అద్భుతమైన ఆలోచనలు వెండితెర మీద ఆవిష్కృతం అయ్యేవా..?.
అయితే రాజమౌళి సోదరుడు కీరవాణి ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి గురించి మనకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసాడు.అదేమిటంటే రాజమౌళి కి చిన్నప్పటి నుండి ఉన్న టాలెంట్ ని చూసి అతను కచ్చితంగా వీడు భవిష్యత్తులో హీరో అవుతాడు,మనం వేడిని హీరో చేద్దాం అనుకునేవారట.రాజమౌళి కి ఇదే విషయం చెప్పినప్పుడల్లా పగలబడి నవ్వేవారట.కానీ పెద్దయిన తర్వాత రాజమౌళి ని హీరో చేసే ప్రయత్నాలు కూడా జరిగాయట.

తండ్రి విజయేంద్ర ప్రసాద్ పెద్ద రైటర్ కాబట్టి తన కొడుకుని హీరో గా పెట్టి సినిమా తీసేందుకు ఒక కథని రాసి, దానికి డైరెక్టర్ గా భీ.గోపాల్ ని పెడదామని అనుకున్నాడట.కానీ రాజమౌళి సస్సేమీర ఒప్పుకోలేదట.అలా రాజమౌళి రూట్ నటన వైపు నుండి దర్శకత్వం వైపు అలా మరిలింది.ఆరోజు ఆయన తీసుకున్న ఆ నిర్ణయం నేడు ప్రతి ఇండియన్ గర్వపడేలా చేస్తుంది.