
Allu Arjun – Sandeep Reddy Vanga: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భవిష్యత్తు లో చెయ్యబోతున్న సినిమాల గురించి ఒక పక్కా ప్రణాళిక తో ముందుకు పోతున్నాడు.పుష్ప పార్ట్ 2 తర్వాత ఆయన ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు, ఎవరితో చెయ్యబోతున్నాడు అనేది మొన్నటి వరకు ఫ్యాన్స్ లో సందిగ్ధం ఉండేది.రోజుకో డైరెక్టర్ పేరు వినిపించేది కానీ, ఏది అధికారికంగా ఖరారు కాలేదు.అవతల హీరోలు క్రేజీ కాంబినేషన్స్ ని ప్రకటిస్తూ ముందుకు దూసుకుపోతుంటే నువ్వు మాత్రం ప్లానింగ్ లేకుండా ఉంటున్నావు అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ తిట్టేవాళ్ళు.
కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అనే అధికారిక ప్రకటన రావడం తో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.అర్జున్ రెడ్డి సినిమా తర్వాత హిందీ లో హిందీ లో అదే సినిమాని కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేసి సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగ.

ప్రస్తుతం ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో ‘ఎనిమల్’ అనే చిత్రం చేస్తున్నాడు, ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా తియ్యబోతున్నాడు, ఈ రెండు చిత్రాల తర్వాతే అల్లు అర్జున్ తో మూవీ ఉంటుంది.అయితే ఈ సినిమా టైటిల్ ఇప్పటికే ఖరారు కూడా అయిపోయిందట.అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘భద్రకాళి’ అనే టైటిల్ ని పెట్టబోతున్నారట.అన్ని బాషలలో కూడా ఇదే పేరు ఉండబోతుంది అని సమాచారం.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట.సందీప్ రెడ్డి వంగ అంటేనే మాస్, ఇక అల్లు అర్జున్ మాస్ మ్యానరిజమ్స్ కి సందీప్ టేకింగ్ తోడైతే పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యినట్టే.చూడాలిమరి రాబొయ్యే రోజుల్లో ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతుందో అనేది.