Chiranjeevi-Anil Ravipudi movie : మన టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం అనేది ఎరుగని మరో దర్శకుడు అనిల్ రావిపూడి. కమర్షియల్ సినిమాలు తీయాలని ప్రతీ పాన్ ఇండియన్ డైరెక్టర్ కి ఉంటుంది. కానీ సరిగా తీయకపోతే ‘గేమ్ చేంజర్’ లాంటి సినిమాలు వస్తాయి. కమర్షియల్ సినిమాలు ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుందో, ఆ డైరెక్టరే చేయాలి. అలాంటి వారిలో ఒకడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం మన టాలీవుడ్ లో అనిల్ రావిపూడి ని మించిన మినిమం గ్యారంటీ కమర్షియల్ డైరెక్టర్ మరొకరు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘పటాస్’ సినిమాతో మొదలైన ఆయన కెరీర్ అంచలంచలుగా ఎదుగుతూ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి వస్తున్నాం వరకు చేరాడు. ప్రతీ సినిమా కూడా ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యింది. కమర్షియల్ సినిమా చేస్తే అనిల్ రావిపూడితోనే చేయాలి అని పాన్ ఇండియన్ హీరోల దగ్గర నుండి, సీనియర్ హీరోల వరకు అనుకుంటున్నారు.
బాలయ్య తో ‘భగవంత్ కేసరి’, వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి సీనియర్ హీరోలిద్దరి కెరీర్స్ మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కి కూడా అలాంటి జ్ఞాపకాలను ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా మొదలు కాబోతుంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ముహూర్తం కూడా లాక్ చేసారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ లో ఉన్నాడు మెగాస్టార్. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే ఆయనకి సంబంధించి బ్యాలన్స్ ఉంది. ఆ బ్యాలన్స్ పూర్తి చేసిన వెంటనే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిపోబోతున్నాడు. అయితే ఈ సినిమా ప్రకటన భారీ రేంజ్ లో ప్లాన్ చేసారు మేకర్స్. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీ అనౌన్స్మెంట్ వీడియో ని మీరంతా చూసే ఉంటారు.
ఆ తరహాలో ఒక అనౌన్స్మెంట్ వీడియో ని ప్లాన్ చేయబోతున్నాడట అనిల్ రావిపూడి. దీనికి సంబంధించిన షూటింగ్ ఈ నెలలోనే చేస్తారట. దీని కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శివరాత్రి కానుకగా ఈ వీడియో ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలకు అర్జెంట్ గా ఒక హిట్ కావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ హిట్ మెగాస్టార్ ద్వారా వస్తే వాళ్ళ ఆనందాలకు హద్దులే లేకుండా పోతుంది. అనిల్ రావిపూడి తాము కోరుకున్న బ్లాక్ బస్టర్ ఇస్తాడని బలమైన నమ్మకం తో ఉన్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఈసారి కేవలం కామెడీ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ ఉన్న సబ్జెక్టు తో రాబోతున్నాడట. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని నచ్చని మనిషి అంటూ ఈ భూమి మీద ఉండదు. అలాంటి వింటేజ్ మెగాస్టార్ ని బయటకి తీసేలా ఈ స్క్రిప్ట్ ఉంటుందట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయనున్నారు.