
Ram Charan- Prabhas: సినిమా వాళ్లకు సంక్రాంతి చాలా ప్రత్యేకం. అది కాసులు కురిపించే సీజన్. కంటెంట్, టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ వసూళ్లు వస్తాయి. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ల వరదే. 2023 సంక్రాంతి ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. మాస్ మసాలా ఎంటర్టైనర్స్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. నిజానికి ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా వీరసింహారెడ్డి మూవీ అవుట్ డేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని క్రిటిక్స్ తేల్చారు. ప్రేక్షకులు మాత్రం ఆదరించారు. బ్రేక్ ఈవెన్ దాటి వీరసింహారెడ్డి హిట్ స్టేటస్ అందుకుంది.
వాల్తేరు వీరయ్యతో చిరంజీవి వీరవిహారం చేశారు. ఏకంగా ఇండస్ట్రీ హిట్ నమోదు చేశారు. సంక్రాంతి సీజన్ కి ఉన్న అడ్వాంటేజ్ అది. అందుకే నిర్మాతలు, స్టార్ హీరోలు సంక్రాంతిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఇక 2024 సంక్రాంతి సీజన్ పై ప్రభాస్ ఆల్రెడీ కర్చీఫ్ వేశాడు. ప్రాజెక్ట్ కే పెద్ద పండగకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 2024 జనవరి 12 ప్రాజెక్ట్ కే విడుదల తేదీగా ప్రకటించారు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది.
అయితే వాళ్ళ ఆశలు గల్లంతయ్యాయని అంటున్నారు. ప్రాజెక్ట్ కే సంక్రాంతికి విడుదలయ్యే సూచనలు లేవట. ఇటీవల అమితాబ్ బచ్చన్ ప్రాజెక్ట్ కే షూట్లో గాయాలపాలయ్యారు. ఆయన తిరిగి కోలుకోవడానికి సమయం పట్టేలా ఉందట. అమితాబ్ పై ఇంకా పది శాతం వరకూ షూటింగ్ జరగాల్సి ఉండగా… ప్రాజెక్ట్ కే చిత్రీకరణ అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం లేదంటున్నారు. దీంతో ప్రాజెక్ట్ కే సంక్రాంతి రేసు నుండి తప్పుకుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సమ్మర్ కి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఈ పరిస్థితిని నిర్మాత దిల్ రాజు వాడుకోవాలని అనుకుంటున్నారట. ప్రాజెక్ట్ కే వాయిదా పడేలా ఉన్న నేపథ్యంలో రామ్ చరణ్ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. దర్శకుడు శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సంక్రాంతికి విడుదల కానీ పక్షంలో ఆర్సీ 15 విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తున్నారట. 2024 సమ్మర్ కి అనుకున్న చిత్రాన్ని సంక్రాంతికి తేవాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. కాగా ఆర్సీ 15 చిత్రానికి ‘సీ ఈ ఓ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.