
KTR: ఇల్లాలు.. అంటే ఇంటికి దీపం అంటారు. అయితే ఆ ఇల్లాలి కంట్రోల్‌లోనే అందరు భర్తలు ఉంటారు. ఉండాలి అని అంటున్నారు తెలంగాణ మంత్రి కె.తారకరామారావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ‘వీ హబ్’లో న్విహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా భార్యను బాస్‌గా సంబోధించారు. కేటీఆర్.
అంతా బాస్‌కు భయపడేవాళ్లే..
వీ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన డిబేట్‌లో కేటీఆర్ బాస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రధాని మోదీ మినహా అందరూ బాస్‌కు భయపడే వాళ్లే అన్నారు. మోదీని ఎందుకు మినహాయించారు అంటే ఆయనకు భార్య లేదు కదా అని పేర్కొన్నారు. బయట ఎంత బిల్డప్ ఇచ్చినా.. మిగతా అందరూ ఇంటికి వెళ్లాకా బాస్‌కు తప్పక భయపడతారని, అందుకు తాను కూడా అతీతుడిని కాదని అన్నారు. దీంతో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.
భార్య బాధిత సంఘాలు..
ఇదిలా ఉంటే.. భార్యల హరాస్‌మెంట్ తట్టుకోలేక చాలా ప్రాంతాల్లో సంఘాలు కూడా పెడుతున్నారు. భార్యా బాధిత సంఘాల పేరుతో భర్తలు హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు. అంటే భార్యలు ఎంత బాధ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పురుషాధిక్య సమాజం అని పదే పదే చెప్పే మహిళలు భార్యా బాధితుల సంఘంపై మాత్రం నోరు మెదపరు. చట్టాలు కూడా మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి. ఇటీవలే కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు భర్తలకు అనుకూలంగా తీర్పు ఇస్తున్నాయి. కొంతమంది కావాలనే భర్తలపై 498, 498ఏ కేసులు పెట్టి వేధిస్తున్నాయి. ఈ కేసులు తట్టుకోలేక భర్తలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. గతంలో ఓ ఐఏఎస్ అధికారి కూడా తన భార్య 498 ఏ కేసు పెట్టిందని ఆత్మహత్య చేసుకున్నారు. చాలా ఏళ్లకు ఇది తప్పుడు కేసని నిరూపితమైంది. కానీ అప్పటికే ఐఏఎస్ ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఏదో సినిమాలో చెప్పినట్లు భార్య భర్తలు ఇద్దరు సమానమే. కానీ భర్త కాస్త ఎక్కువ సమానం అన్న ధోరణి ఇంకా సమాజంలో ఉంది. అయినా, భార్యలకు భయపడేవారు, భయపడినట్లు నటించే వారు పెరుగుతున్నారు.