Homeఆంధ్రప్రదేశ్‌Jagan- Amaravati Lands: రాజధాని భూములపై జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్టేనా

Jagan- Amaravati Lands: రాజధాని భూములపై జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్టేనా

Jagan- Amaravati Lands
Jagan- Amaravati Lands

Jagan- Amaravati Lands: ఏపీ రాజధాని విషయంలో వైసీపీ సర్కారు మూటగట్టుకున్న అపవాదు అంతా ఇంతా కాదు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖ పాలనా రాజధానికాగా.. అమరావతి శాసన రాజధానిగా ఉంచారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించారు. కానీ ఎక్కడా కూడా ముందడుగు వేయలేకపోయారు. ముందుగా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. అటు తమ ప్రాంతానికి రాజధాని వస్తుండడాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆహ్వానించలేదు. అటు రాయలసీమ ప్రజలు సైతం రాజధానిని మరింత దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఇష్యూ రేజ్ అయ్యింది. వైసీపీ అభ్యర్థులను ఓటమికి ఇదే కారణమైంది. కానీ ఈ ఫలితాలను గుణపాఠంగా నేర్చుకోని జగన్ సర్కారు మూడు రాజధానుల అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి సానుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది.

జీవో 42 జారీ..
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూడు వేల ఎకరాలను ఇందుకు కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 45ను జారీ చేసింది. దీనిపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. రాజధాని కోసం తాము భూములిస్తే జగన్ ప్రభుత్వం వాటిని ఇళ్ల స్థలాల పేరుతో ఇతరులకు పంచుతోందంటూ రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతికి చెందిన ఓ రైతు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ఈ దశలో ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. దీంతో జగన్ ప్రభుత్వానికి ఊరట లభించనట్లయింది.

కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం..
సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో వరుసగా హైకోర్టులో వైసీపీ సర్కారుకు అనుకూలంగా తీర్పు రావడంతో అధికార పార్టీలో ఒకరకమైన ఆనందం నెలకొంది. అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని అధికార పార్టీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. రాజధాని అభివృద్ధికి కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగించరాదని హైకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందని రైతుల తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రస్తుత జీవో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేయడంతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ)లను ఆదేశించింది.

Jagan- Amaravati Lands
Jagan

కలుగజేసుకోలేమని చెప్పిన హైకోర్టు..
అయితే ఈ భూముల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వా వాదన వేరేగా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 32 వేల ఎకరాల భూసేకరణలో అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. చాలామంది బినామీల పేరిట భూములు కొనుగోలు చేశారని ఆరోపిస్తోంది. బడా వ్యక్తులు తమ ఇంట్లో డ్రైవర్లు, పనివారి పేరు మీద భూములు కొనుగోలు చేసినట్టు కూడా ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆ భూములు కేటాయిస్తుండడంతో అవి తమ భూములేనని బినామీలు ముందుకు రావాలి. అలా వస్తే అసలు బినామీలను గుర్తించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలా చేస్తే అన్ని వివరాలతో అత్యున్నత న్యాయస్థానానికి నివేదించే చాన్స్ ప్రభుత్వానికి దక్కుతుంది. అందుకే ఈ విషయంలో అమరావతి రైతులు జాగ్రత్తపడ్డారు. కొందరే కోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.రాజధాని అంశంపై ఇప్పటికే విచారణ సుప్రీంకోర్టులో సాగుతున్నందున పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కోర్టులు ఎలా అడ్డుకుంటాయని హైకోర్టు వెల్లడించింది. కాబట్టి పేదలకు ఇళ్ల స్థలాల విషయం అంశంలో తాము స్టే ఇవ్వబోమని వెల్లడించింది. అయితే దీనిని వైసీపీ సర్కారు సానుకూలాంశంగా చెప్పుకోగా.. అమరావతి రైతులు మాత్రం అంతిమంగా తమకే అనుకూలంగా సుప్రీం తీర్పు ఇస్తుందని ఆశాభావంతో ఉన్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular