Homeట్రెండింగ్ న్యూస్Longest Night Of the Year : నేడు పగటి సమయం ఎనిమిది గంటలే.. రాత్రి...

Longest Night Of the Year : నేడు పగటి సమయం ఎనిమిది గంటలే.. రాత్రి సమయం 16 గంటలు.. ఎందుకిలా? ఏదైనా ప్రమాదానికి సంకేతమా?

Longest Night Of the Year :  చలికాలంలో పగటి కాలం తక్కువగా ఉంటుంది. రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. వేసవి సమయంలో భూమి సూర్యుడికి దగ్గరగా వస్తుంది. చలికాలంలో సూర్యుడికి దూరంగా వెళ్తుంది. అందువల్లే భూమి భ్రమించే కక్ష్యలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. దీనిని వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ అయనాంతాల వల్ల భూమి తిరిగే దిశలలో మార్పులు ఉంటాయి. శీతాకాలం అయనాంతం వల్ల భూమి సూర్యుడికి దూరంగా జరుగుతుంది. ఆ సమయంలో భూమి ధ్రువం ఒక్కసారిగా 23.5 డిగ్రీల వంపు తిరిగి ఉంటుంది. దీనివల్ల మానవాళికి ఎటువంటి ముప్పు ఉండదని.. ఇది ప్రకృతి పరంగా సహజమైన మార్పు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్ల సూర్యకాంతి ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుందని, పగటి సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల సూర్యకాంతి కేవలం ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది.. చంద్రుడి కాంతి 16 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో తన అక్షం వైపు భూమి తిరిగే సమయంలో కాస్త మార్పు చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో దక్షిణార్థ గోళంలో భూమి, సూర్యుడి మధ్య దూరం గరిష్టంగా చోటు చేసుకుంటుంది. దీనిని ఆయనాంతరం అని పిలుస్తారు. ఇదే సమయంలో సూర్యుడు పగటిపూట ఎక్కువ లేదా తక్కువ స్థానానికి వెళ్ళినప్పుడు సూర్యుడి చుట్టూ భూమి కక్ష్యలో రెండు బిందువులు చోటుచేసుకుంటాయి.. వీటిని అయనాంతం అంటారు. దీనివల్ల సంవత్సరంలోనే అత్యంత పొడవైన రోజు ఏర్పడుతుంది. అత్యంత తక్కువ రోజు కూడా చోటు చేసుకుంటుంది. పొడవైన రోజును వేసవి కాలపు అయనాంతం, తక్కువ రోజును శీతాకాలపు అయనాంతం అంటుంటారు. అయితే ఇవి ప్రతి ఏడాది రెండు సార్లు జరుగుతాయి. ఏడాది మొత్తం ఉత్తర, దక్షిణ అర్ధగోళాలలో భూమి సూర్యుడు వైపు వంగుతుంది. వేసవి కాలంలో ఏర్పడే అయనాంతం అనేది అత్యంత సుదీర్ఘమైన రోజు.

ఎలాంటి నమ్మకాలు పాటిస్తారంటే..

చలికాలంలో ఏర్పడే అయనాంతం పై అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. చైనా, తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధ మతాన్ని పాటిస్తారు. ఇక్కడి యన్, యాంగ్ అనే ప్రజలు తమ ఐక్యతకు ఈరోజు దోహదం చేస్తుందని భావిస్తుంటారు. అందువల్లే రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మనదేశంలో వైష్ణవ ఆలయాలలో కృష్ణుడికి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పిస్తారు. గీతా పారాయణం చేస్తుంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో పుష్యమాసం పేరుతో పండగ నిర్వహిస్తుంటారు. ఇక ఇక్కడి నుంచి సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది. శీతాకాలం అయనాంతం ఏర్పడటం, తేదీలో మార్పు చోటు చేసుకోవడం కచ్చితంగా జరుగుతుంది. డిసెంబర్ 20 నుంచి 23 తేదీలలోనే ఇది వస్తుంది. ఈ ఏడాది ఇది 21వ తేదీన (శనివారం) చోటుచేసుకుంది. దీనివల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమి మీదకు వస్తాయి. దానివల్ల ఉష్ణోగ్రతలలో మార్పులు జరుగుతుంటాయి. అందువల్లే తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular