
Heroine Laya: మనం చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన హీరోయిన్స్ లో మన కళ్ళ ముందే టాప్ స్టార్స్ హీరోయిన్స్ గా ఎదిగి నేడు మాయమైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు,వారిలో ఒకరు లయ.అందాల ఆరబోతకు దూరం గా సంప్రదాయబద్ధమైన ట్రెడిషనల్ లుక్స్ తో అచ్చతెలుగు అమ్మాయిలాగా కనిపించే లయ తెలుగులో సుమారుగా 50 సినిమాల్లో నటించింది.వీటిల్లో 90 శాతం వరకు అన్నిట్లో ఈమె హీరోయిన్ గానే నటించింది.
‘భద్రం కొడుకో’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి చైల్డ్ ఆర్టిస్టు గా పరిచయమైంది.ఆ తర్వాత 1999 వ సంవత్సరం లో వేణు తొట్టెంపూడి హీరో గా నటించిన ‘స్వయంవరం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది.తొలి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న లయకి ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.ఒకానొక్క దశలో ఆమె ఏడాది 6 నుండి 7 సినిమాలు చేసేది.
అలా చూస్తూ ఉండగానే పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన లయ 2006 వ సంవత్సరం లో గణేష్ అనే అతనిని పెళ్ళాడి లాస్ ఏంజిల్స్ లో స్థిరపడింది.ఈమెకి ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు.కొడుకు పేరు వచన్ కాగా, కూతురు పేరు శ్లోక.కూతురు శ్లోక రవితేజ హీరో గా నటించిన ‘అమర్ ఆఖ్బర్ఆంటోనీ’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.ఇది ఇలా ఉండగా చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న లయ, ఈమధ్య కాలం లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఈ ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీ లో తనకి ఎదురైనా కొన్ని సంఘటనలను చెప్పుకొచ్చింది.

అయితే లయతో గతం లో పని చేసిన ఒక హీరో ఆమెతో ప్రేమలో పడ్డాడట, కానీ అతనికి ధైర్యం గా ప్రపోజ్ చెయ్యడానికి బయపడేవాడట , లయ ఆ విషయాన్నీ ఎప్పుడో అర్థం చేసుకొని ఆమె కూడా తెలిసీ తెలియకుండానే ఉన్నట్టు ఉండేదట.అలా చివరికి ఆ లవ్ స్టోరీ ప్రారంభం కాకముందే క్లోజ్ పడింది అంటూ చెప్పుకొచ్చింది.ఇంతకీ ఆ హీరో ఎవరు ఏమిటి అనేది వివరాలు బయటపడలేదు కానీ, లయ తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించాడని మాత్రం తెలిసింది.