NTR: జూనియర్ ఎన్టీఆర్ ని మాస్ లో తిరుగులేని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా సింహాద్రి.’దర్శక ధీరుడు రాజమౌళి కి ఇది రెండవ సినిమా.స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత వీళ్లిద్దరి కలయిక లో వచ్చిన రెండవ సినిమా కూడా ఇదే.ఆరోజుల్లోనే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ తిరగరాసి సుమారుగా 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం టాప్ 2 హిట్ గా నిల్చింది.ఎన్టీఆర్ కి మాస్ ఐకాన్ ఇమేజి ని తెచ్చిపెట్టింది.

ఆరోజుల్లోనే ఈ సినిమా 70 కేంద్రాల్లో 175 రోజులను కూడా పూర్తి చేసుకుంది.ఇప్పటికీ ఈ రికార్డుని బద్దలు కొట్టిన సినిమా కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇండియాలోనే లేదు.అలా ఎన్నో రికార్డ్స్ ని కొల్లగొట్టిన ఈ సినిమా షూటింగ్ సమయం లో ఎన్టీఆర్ కొన్ని విషయాల్లో బాగా ఇబ్బందికి గురయ్యాడట.అదేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్స్ గా భూమిక మరియు అనిత నటించారు.భూమిక తో జూనియర్ ఎన్టీఆర్ కి అత్యధిక సన్నివేశాలు ఉన్నప్పటికీ ఆమె నుండి ఆయనకీ ఎలాంటి ఇబ్బంది కలుగలేదు కానీ, అంకిత వల్ల మాత్రం ఎన్టీఆర్ కి బాగా ఇబ్బంది అయ్యిందట.అవసరం ఉన్న లేకపోయినా ఊరికినే మీదపడుతూ ఉండేదట.అందుకే ఎన్టీఆర్ చాలా ఇబ్బందికి గురైనట్టు ఆరోజుల్లో వార్తలు ఒక రేంజ్ లో ప్రచారం అయ్యేది.ఇక అప్పటి నుండి భవిష్యత్తులో ఈ హీరోయిన్ తో పొరపాటున కూడా సినిమా చెయ్యకూడదని అనుకున్నాడట.

అప్పటి నుండి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు.కెరీర్ ప్రారంభం లో ఈమెకి మంచి సూపర్ హిట్స్ ఉండేవి,కానీ ఆ తర్వాత వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో కెరీర్ ముగిసిపోయింది.ఇక ఆ తర్వాత 2016 వ సంవత్సరం లో ముంబై కి చెందిన విశాల్ అనే ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్ళాడి న్యూ జెర్సీ లో స్థిరపడిపోయింది.